ETV Bharat / international

హ్యూస్టన్​కు చేరుకున్న ఫ్లాయిడ్​ పార్థివదేహం - AMERICA PROTESTS LATEST NEWS

అమెరికాలో.. ఫ్లాయిడ్​ మృతదేహాన్ని టెక్సాస్​కు తరలించారు పోలీసులు. హ్యూస్టన్​లో సోమవారం ఆరు గంటల పాటు ప్రజలు నివాళులు అర్పించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం పియర్లాండ్​ శివార్లలో అంత్యక్రియలు జరపనున్నారు.

Floyd's body arrives in Houston ahead of funeral
హ్యూస్టన్​కు చేరుకున్న ఫ్లాయిడ్​ పార్థివ దేహం
author img

By

Published : Jun 7, 2020, 10:44 PM IST

Updated : Jun 8, 2020, 6:33 AM IST

హ్యూస్టన్​కు చేరుకున్న ఫ్లాయిడ్​ పార్థివదేహం

అమెరికాలో పోలీసు చేతిలో మరణించిన జార్జ్​ ఫ్లాయిడ్​ మృతదేహం టెక్సాస్​కు చేరుకుంది. ఫ్లాయిడ్​ కుటుంబ సభ్యులు కూడా సురక్షితంగా వచ్చినట్లు హ్యూస్టన్​ పోలీస్​ విభాగం సారథి​ ఆర్ట్​ అసేవెడో ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

ఫ్లాయిడ్​ను ప్రజలు చివరి చూపు చూసుకొని, నివాళులు అర్పించే విధంగా సోమవారం ఆరు గంటలపాటు హ్యూస్టన్​లో పార్థివదేహాన్ని ఉంచే ఏర్పాటు చేశారు అధికారులు. అనంతరం మంగళవారం పియర్లాండ్​ శివార్లలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Floyd's body arrives in Houston ahead of funeral
హ్యూస్టన్​కు చేరుకున్న ఫ్లాయిడ్​ పార్థివ దేహం

వెనుదిరుగుతున్న సైనిక బలగాలు..

నేషనల్​ గార్డ్​ దళాలను అమెరికా రాజధాని వాషింగ్టన్​ నుంచి వైదొలగాలని ఆదేశించారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ప్రస్తుత పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉందని వెల్లడించారు. ఫ్లాయిడ్​ మృతితో చెలరేగిన నిరసనలను అరికట్టేందుకు గతవారం కొంతమంది సైనిక బలగాలను పంపించాలని కొలంబియా ప్రభుత్వం ట్రంప్​ను కోరింది. ఈ క్రమంలోనే నగరంలో పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని వేలాది మంది నేషనల్​ గార్డ్​ దళాలను ఆదేశించారు ట్రంప్.

అయితే, ఈ దళాలను ఉపసంహరించుకోవాలని డి.సి. మేయర్​ మురియెల్​ బైసర్​ ట్రంప్​ను డిమాండ్​ చేశారు. ఇందుకు స్పందించిన ట్రంప్​.. వారంతా తిరిగి వెళ్తున్నారని, అవసరమైతే మళ్లీ వస్తారని ట్విట్టర్​ ద్వారా తెలిపారు.

ఇదీ చూడండి:కిక్కిరిసిన అమెరికా రోడ్లు- శాంతియుతంగా నిరసనలు​

Last Updated : Jun 8, 2020, 6:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.