ETV Bharat / international

జాతి వివక్షతో నేల రాలిన ప్రాణాలు- ఉద్భవించిన ఆశలు - పౌర హక్కుల ఉద్యమం అమెరికా

జాతి వివక్ష సమస్యను సముద్రంతో పోల్చితే.. జార్జ్​ ఫ్లాయిడ్​ అనే నల్లజాతీయుడి ఉదంతం ఒక నీటి బొట్టుతో సమానం. ఎన్నో దశాబ్దాలుగా అమెరికాలో జాతి వివక్ష కొనసాగుతోంది. అనేక మంది అమాయకులు బలయ్యారు. 'మాకూ సమాన హక్కులు కావాలి' అంటూ లక్షలాది మంది నిరసనలు చేపట్టారు. ఆ అమానవీయ ఘటనలు, నిరసనల ఫలితాలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం...

floyd-protests-a-look-into-civil-rights-movement-in-us
జాతి వివక్షతో నేల రాలిన ప్రాణాలు.. ఉద్భవించిన ఆశలు
author img

By

Published : Jun 8, 2020, 3:06 PM IST

జార్జ్​ ఫ్లాయిడ్​.. జాతి వివక్షకు గురై ప్రాణాలు విడిచిన నల్లజాతీయుడు. అతడి వ్యథ యావత్ ప్రపంచాన్ని కదిలించింది. అమెరికా సహా వివిధ దేశాల్లో నిరసనలు భగ్గుమన్నాయి.

అయితే అగ్రరాజ్యంలో జాతి వివక్ష కొత్తేమీ కాదు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ మహమ్మారి కారణంగా అనేక మంది ప్రాణాలు వీడారు. చాలా మంది రోడ్లపైకి వచ్చి నిరసన బాటపట్టారు. ఈ చీకటిలో నుంచి ఎందరో మహనీయులు ఉద్భవించారు. నల్లజాతీయుల హక్కులు, సమానత్వం కోసం పోరాడారు. చరిత్రలో నిలిచిపోయిన ఇలాంటి సంఘటనలు ఎన్నో.. ఎన్నెన్నో..

1955...

1950 దశకంలో జాతి వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఆనాటి అగ్రరాజ్య రాజకీయాల్లో ఇదే హాట్​ టాపిక్​.

1955లో అలబామాలోని మాంట్​గొమేరిలో రోసా పార్క్స్​ అనే నల్లజాతి మహిళ.. బస్సులో శ్వేతజాతీయుల కోసం కేటాయించిన సీటులో కూర్చుంది. ఇతరులు ఒత్తిడి చేసినా అక్కడి నుంచి లేవకుండా, వివక్షను ప్రశ్నించింది. ఈ కారణంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

  • పార్క్స్​ చర్యతో పౌర హక్కుల ఉద్యమం ఊపందుకుంది.
  • ఈ ఉదంతంతోనే మార్టిన్​ లూథర్​ కింగ్​ జూనియర్​ వెలుగులోకి వచ్చారు. అహింస అనే సిద్ధాంతంతో జాతివివక్షకు వ్యతిరేకంగా ప్రచారాలు మొదలుపెట్టారు.

1957, సెప్టెంబర్​ 25...

అర్కాన్సస్​కు చెందిన లిటిల్​ రాక్​లోని సెంట్రల్​ హై స్కూల్​లో.. తొమ్మిది మంది నల్లజాతి యువతపై శ్వేత జాతి యువకులు దాడికి పాల్పడ్డారు. ఆ తొమ్మిది మంది అక్కడి నుంచి బయట పడటానికి భద్రతా దళాలు సహాయం చేయాల్సి వచ్చింది.

  • ఈ ఘటనకు మూడేళ్ల ముందే... నల్లజాతీయులను ఉద్దేశించి 'విభిన్నంగా ఉన్నా.. సమానమే' అంటూ అక్కడి సుప్రీంకోర్టు ప్రకటించింది. అయినప్పటికీ వారిపై దాడులు ఆగలేదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను చాలా మంది వ్యతిరేకించారు.

1963, జూన్​ 11..

జాతి సమైక్యతకు వ్యతిరేకంగా ప్రవర్తించారు అప్పటి అలబామా గవర్నర్​ జార్జ్​ వాల్లేస్​. పాఠశాలలో చేరాలనుకున్న ఇద్దరు నల్లజాతీయులను.. క్యాంపస్​ ద్వారాల వద్ద అడ్డుకున్నారు.

  • నేషనల్​ గార్డ్స్​ రంగంలోకి దిగితే కాని వాల్లేస్​ వెనక్కి తగ్గలేదు. అనంతరం విద్యార్థులు క్యాంపస్​ లోపలకు చేరారు.

1963, ఆగస్ట్​ 28...

పౌర హక్కులు, ఉద్యోగాలు, స్వేచ్ఛను డిమాండ్​ చేస్తూ 2,50,000మంది అమెరికన్లు వాషింగ్టన్​లోని లింకన్​ మెమోరియల్​కు కవాతు నిర్వహించారు.

  • ఇక్కడే మార్టిన్​ లూథర్​ కింగ్​ జూనియర్​ ప్రఖ్యాత 'ఐ హాడ్​ ఏ డ్రీమ్​' ప్రసంగం చేశారు. ఇది చరిత్ర పుటల్లో నిలిచిపోయింది.
  • ఈ కవాతుతో దేశంలో అనేక సంస్కరణలు జరిగాయి. 1964లో పౌర హక్కుల చట్టం, 1965లో ఓటు హక్కు చట్టానికి ఈ కవాతు నాంది పలికింది.
  • ఈ పరిస్థితుల మధ్య మార్టిన్​ లూథర్​ కింగ్​, మాల్కమ్​ ఎక్స్​ వంటి నాయకులు ఉద్భవించారు. జాతి, ఆర్థిక సమానత్వంపై విస్తృతంగా ప్రచారాలు చేశారు.

1964 జులై...

న్యూయార్క్​ జిల్లాలోని హార్లెమ్​లో 15ఏళ్ల నల్లజాతి బాలుడిని ఓ పోలీసు కాల్చి చంపేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది.

  • పౌరహక్కుల చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ జాతి వివక్ష కొనసాగింది. ఫలితంగా పోలీసుల కర్కశత్వం, దోపిడీ భయాలతో.. మేరీల్యాండ్​, హార్లెమ్​, రాచెస్టర్​లో నిరసనలు భగ్గుమన్నాయి.

1965, మార్చి 7...

నల్లజాతీయుల ఓటు హక్కు కోసం పెద్ద యుద్ధమే జరిగింది. అలబామా నుంచి కవాతు నిర్వహించారు నిరసనకారులు. వారిపై శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో పోలీసులు విజృంభించారు. ఎడ్​మండ్​ పిట్టస్​ బ్రిడ్జ్​పై జరిగిన ఈ ఉదంతాన్ని 'బ్లడీ సండే'గా పిలుస్తారు.

  • అనంతరం ఈ కవాతును నిర్వహించడానికి ఫెడరల్​ కోర్టు అనుమతినిచ్చింది. ఇందులో పాల్గొనే వారికి నేషనల్​ గార్డ్స్​ భద్రత కల్పించాలని ఆదేశించింది.
  • దాదాపు 3వేల మంది భద్రతా సిబ్బంది రక్షణ మధ్య కవాతును పూర్తి చేయగలిగారు నిరసనకారులు. అహింస మార్గంలో నడిచిన ఈ కవాతు.. చరిత్రలో తనకుంటూ ఓ స్థానాన్ని దక్కించుకుంది.
  • అనంతరం ఓటు హక్కును కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు 1965లో కాంగ్రెస్​ ఆమోద ముద్రవేసింది.

1967...

జాతి వివక్షకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మళ్లీ భగ్గుమన్నాయి. వీటిపై దర్యాప్తు చేపట్టాలని నాటి అధ్యక్షుడు లిండన్​ జాన్స్​ కెర్నర్​ కమిషన్​ను నియమించారు.

  • బిలియన్​ డాలర్లతో పేద నగరాలను అభివృద్ధి చేయాలని కమిషన్​ సూచించింది. పౌరులు-పోలీసుల మధ్య సంబంధాలను పెంపొందించేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఉద్యోగ అవకాశాల్లో వివక్ష ఉండకూడదని స్పష్టం చేసింది.

1968, ఏప్రిల్​ 4...

టెన్నెస్సీకి చెందిన మెమ్​ఫిస్​లోని ఓ హొటల్​ బాల్కనీలో నిలబడ్డ మార్టిన్​ లూథర్​ కింగ్​ను దుండగులు కాల్చి చంపేశారు.

  • కింగ్​ మరణించిన 7 రోజులకు.. 1968 పౌర హక్కుల చట్టంపై అధ్యక్షుడు జాన్సన్​ సంతకం చేశారు.
  • జాతి, రంగు, మతం, లింగం, వైకల్యం, కుటుంబ పరిస్థితులు వంటివి చూడకుండా అందరికీ ఇళ్ల విషయంలో సమాన అవకాశాలు కల్పించిందీ చట్టం.

1995, అక్టోబర్​ 16...

వాషింగ్టన్​లోని నేషనల్​ మాల్​ వద్ద 'మిలియన్​ మ్యాన్​ మార్చ్​' నిర్వహించారు. లక్షలాది మంది ముందుకొచ్చి.. తమ జీవితాలు, తమ కుటుంబ సభ్యుల జీవితాలు, సమాజాన్ని మెరుగుపరచడానికి ప్రతిజ్ఞ చేశారు.

  • ఈ కవాతులో దాదాపు 4 లక్షల మంది పాల్గొన్నారని నేషనల్​ పార్క్​ సర్వీస్​ తెలిపింది. అయితే ఆ సంఖ్య 8లక్షలు దాటుతుందని మరో ప్రైవేటు సంస్థ పేర్కొంది.

2014...

న్యూయార్క్​ నగర పోలీసు అధికారి చేతిలో ఎరిక్​ గార్నర్​ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 'ఐ కాంట్​ బ్రీత్​' అన్న అతడి చివరి మాట.. పోలీసుల కర్కశత్వానికి వ్యతిరేకంగా జరిపిన నిరసనలకు నినాదమైంది.

  • 2019వరకు ఈ కేసు విచారణ జరిగింది. చివరికి నిందితుడికి ఎలాంటి శిక్షపడలేదు.

ఇలా ఎన్ని ఘటనలు జరిగినా... ఎన్ని చట్టాలు రూపొందించినా.. నల్లజాతీయులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇందుకు 2020 మే 25న మరణించిన జార్జ్​ ఫ్లాయిడ్​ సాక్ష్యం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.