వెనెజువెలాలో మంటలను ఆసరాగా తీసుకొని జంతువుల వేటకు వెళ్లిన 11 మంది యువకులు అగ్నికీలల్లో చిక్కుకుని మరణించారని సమచారం. ఈ మేరకు వెనెజువెలా అటార్నీ జనరల్ తారిక్ విలియం ప్రకటన విడుదల చేశారు.
ఆరాగ్వా రాష్ట్రంలోని కాగ్వా ప్రాంతంలో చెరుకు తోటకు మంటలు అంటుకున్నాయని తెలిపారు తారిక్. దీన్ని ఆసరాగా తీసుకుని కుందేళ్లు, ఉడుములను వేటాడేందుకు యత్నించిన యువకులు బలమైన గాలులతో మంటలు తీవ్రమయిన నేపథ్యంలో అగ్నిలో చిక్కుకుపోయారని వెల్లడించారు. ఇలా మంటలను ఆధారంగా చేసుకుని దశాబ్దాలుగా కొంతమంది వేట సాగిస్తున్నారని తారిక్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'హ్యూస్టన్'లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి