భారతీయ సంప్రదాయాల్లో ఉపవాసాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పండగలపూటో.. వారానికి ఒక రోజో, రెండు రోజులో ఉపవాసం చేస్తున్న వారిని చూస్తూనే ఉంటాం. అయితే కొంత మంది ఉపవాసం చేయడం వల్ల అనారోగ్యం పాలవుతామని చెబుతుంటే, మరికొంత మంది ఉపవాసం చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని చెబుతుంటారు. ఇక సైన్స్ అయితే ఉపవాసం వల్ల ఆరోగ్యానికి ఏ ఢోకా లేదని చెబుతోంది. రోజు విడిచి రోజు చేస్తే వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుందంటోంది. తాజాగా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది డాక్టర్ మార్క్ లారెన్స్ 'ది యూనివర్శిటీ ఆప్ సిడ్నీ' సర్వే.
సాధారణంగా మనం నిత్యం ఆహారం తీసుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇస్తాం. అయితే రోజు విడిచి రోజు ఉపవాసం చేయడం వల్ల కాలేయంలోని కొవ్వు ఆమ్లాల జీవక్రియ మెరుగుపడటమే కాకుండా రక్తంలో గ్లూకోజ్ నిల్వలపై నియంత్రణ పెరిగి మధుమేహం రాకుండా సహకరిస్తుంది. తద్వారా ఆరోగ్యం బాగుంటుందని డాక్టర్ మార్క్ లారెన్స్ 'ది యూనివర్శిటీ ఆప్ సిడ్నీ' సర్వే వెల్లడించింది.
సర్వేలో భాగంగా ఎలుకపై ప్రయోగం చేపట్టారు. రోజు విడిచి రోజు ఉపవాసం చేయడం వల్ల కాలేయంలోని ప్రోటీన్లను ఎలా ప్రభావితం చేస్తుందో గుర్తించారు. ఇలా ఉపవాసం చేస్తే ఆమ్ల జీవక్రియపై కొవ్వు ఊహించని ప్రభావాన్ని చూపిందని గుర్తించారు. అలాగే శరీరంలో పేరుకున్న కొవ్వు కరగించి గుండె జబ్బులను దూరం చేస్తుందని డాక్టర్ మార్క్ స్పష్టం చేశారు.
" ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. కానీ రోజు విడిచి రోజు ఉపవాసం చేయడం వల్ల ఇది కాలేయ ప్రోటీన్లపై ఎలా ప్రభావితం చేస్తుందో ఈ ప్రయోగం ద్వారా తెలుసుకున్నాం. ఇది జీవక్రియ విధులకు తోడ్పడుతుంది. ఎలుకపై ప్రయోగం చేయడం వల్ల కాలేయంలోని ప్రోటీన్లపై ప్రభావం గుర్తించాం. ఇదే విధంగా మానవ శరీరంలోనూ ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో అర్థం చేసుకోగలిగాం."
-- డాక్టర్ మార్క్ లారెన్స్
ఇదీ చదవండి: కష్టపడకుండా బరువు తగ్గాలా? అయితే ఇది మీకోసమే