ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. పలు దేశాల్లో భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 3.33 కోట్ల మందికి వైరస్ సోకగా.. 10.02 లక్షల మంది మృత్యువాత పడ్డారు. సుమారు 2.46 కోట్ల మంది కోలుకున్నారు.
- అమెరికాలో కొత్తగా 33 వేల కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 7.32 లక్షలకు చేరుకోగా.. 2.09 లక్షల మంది వైరస్‌కు బలయ్యారు.
- బ్రెజిల్లో ఆదివారం 14 వేల కేసులు రాగా.. మొత్తం సంఖ్య 4.73 లక్షలకు చేరింది.
- రష్యాలో వైరస్ వ్యాప్తి స్థిరంగా ఉంది. కొత్తగా 7,867 మందికి వైరస్ సోకింది. మొత్తం సంఖ్య 11.51 లక్షలకు చేరింది. మరణాల సంఖ్య 20 వేలకు దాటింది.
- ఫ్రాన్స్‌లో ఆదివారం 11 వేల మందికి సోకినట్లు నిర్ధరించారు. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలు దాటగా.. 31 వేల మంది చనిపోయారు.
- అర్జెంటీనాలో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం 8 వేల మంది వైరస్ బారిన పడగా.. ఇప్పటివరకు 6.91 లక్షల మందికి సోకింది.
దేశం | మొత్తం కేసులు | మరణాలు | కోలుకున్నవారు |
అమెరికా | 73,21,343 | 2,09,453 | 45,60,456 |
బ్రెజిల్ | 47,32,348 | 1,41,776 | 50,13,367 |
రష్యా | 11,51,438 | 20,324 | 9,43,218 |
కొలంబియా | 8,13,056 | 25,488 | 7,11,472 |
పెరూ | 8,05,302 | 32,262 | 6,64,490 |
ఇదీ చూడండి: ఆ రేస్‌తో స్ఫూర్తి నింపుతున్న 'తొలి' కరోనా బాధితుడు