ETV Bharat / international

'బైడెన్​ వైఫల్యంతోనే తాలిబన్ల దురాక్రమణ'

అఫ్గానిస్థాన్​ విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ అనుసరిస్తున్న విధానంపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ నిప్పులు చెరిగారు. తాలిబన్లు అఫ్గాన్​లోని పలు నగరాలను స్వాధీనం చేసుకోవడం పూర్తిగా బైడెన్​ అధికార వైఫల్యానికి నిదర్శనం అని విమర్శించారు.

trump, biden
ట్రంప్​, బైడెన్​
author img

By

Published : Aug 15, 2021, 9:19 AM IST

Updated : Aug 15, 2021, 11:29 AM IST

అఫ్గానిస్థాన్​లోని తాలిబన్ల విషయంలో అమెరికా అనుసరిస్తున్న విధానాన్ని తప్పుపట్టారు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​. తాలిబన్లు అఫ్గాన్​లోని నగరాలను, ప్రావిన్సులను స్వాధీనం చేసుకోవడంపై స్పందించిన ఆయన.. ఈ విషయంలో అధ్యక్షుడు జో బైడెన్​ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.

"ఇప్పటివరకు అమెరికా మీద ఉన్న భయం, గౌరవం ఇకపై తాలిబన్లకు ఉండవు. కాబూల్​లోని అమెరికా రాయబార కార్యాలయంపై తాలిబన్లు వారి జెండా ఎగరవేస్తారు. అదే జరిగితే ఆ ఘటన అమెరికాకు ఏంతో అవమానకరం. అది కచ్చితంగా అమెరికా వైఫల్యంగా పరిగణించాలి. బలహీనత, అసమర్థతకు అద్దం పడుతోంది."

-డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా మాజీ అధ్యక్షుడు

అఫ్గానిస్థాన్​లో 5 వేల మంది అమెరికా బలగాలను మోహరిస్తున్నాట్లు అధ్యక్షుడు జోబైడెన్​ తెలిపిన కొన్ని గంటల్లోనే ట్రంప్​ ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశాంగ విధానం, ఇతర సమస్యలపై బిడెన్ ప్రతిసారీ తప్పు చేస్తారని అన్నారు.

"అఫ్గాన్​ నుంచి అమెరికా పారిపోయింది అని అందరూ అనుకుంటారు. గతంలో అనుసరించిన ప్రణాళికలను కొనసాగించి ఉంటే మన రాయబార కార్యాలయాన్ని తమ అధీనంలోకి తీసుకోవాలి అనే ఆలోచన కూడా వారిలో కలిగేది కాదు. ఇప్పుడు అమెరికాపై కొత్త దాడులకు ప్రణాళికలు రచిస్తున్నారు."

-ట్రంప్​, అమెరికా మాజీ అధ్యక్షుడు

తాలిబన్ల అధీనంలో మరో ప్రావిన్స్​..

తాలిబన్లు తాజాగా బల్ఖ్​ ప్రావిన్స్ రాజధాని మజార్-ఇ-షరీఫ్​ను స్వాధీనం చేసుకున్నారు. మజార్​-ఇ-షరీఫ్​.. ఉత్తర అఫ్గాన్​లో చివరి ప్రధాన నగరం. అఫ్గాన్​ సైనిక బలగాలుతో భీకర పోరు అనంతరం ఈ నగరంపై తాలిబన్లు పట్టు సాధించారు. ఈ నగరం నుంచి అఫ్గాన్​ సైనికులు పారిపోయినట్లు పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ చేస్తున్నాయి. దీంతో ఉత్తర అఫ్గాన్​ మొత్తం తాలిబన్లు స్వాధీనం చేసుకున్నట్లు అయింది.

ఇదీ చూడండి: కాబుల్​కు 70 కి.మీ దూరంలో తాలిబన్లు- ఏ క్షణమైనా...

Last Updated : Aug 15, 2021, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.