ETV Bharat / international

'అది తీసుకున్నా.. ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారు' - హైడ్రాక్సీక్లోరోక్విన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా నియంత్రణ కోసం రెండు వారాల పాటు హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకున్న నేపథ్యంలో శ్వేతసౌధం వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, మలేరియా ఔషధం దుష్ప్రభావాలు ఏమీ లేవని వైద్యులు తెలిపారు. ఆయితే ట్రంప్ కాస్త ఊబకాయం సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించారు.

Doctors kept close eye on Trump's use of malaria drug
ట్రంప్​నకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన శ్వేతసౌధం వైద్యులు
author img

By

Published : Jun 4, 2020, 10:18 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితులను శ్వేతసౌధం వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కరోనా నియంత్రణ కోసం ఆయన రెండు వారాల పాటు మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గుండె లయ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఎలక్ట్రోకార్డియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు వైద్యులు.

"ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారు. రెండువారాల మలేరియా కోర్సు తీసుకున్నప్పటికీ ఆయనపై ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపలేదు."

- సీన్​ కొన్లీ, వైద్యుడు

బరువు పెరిగిన ట్రంప్

ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, ఆయన ఓ పౌండ్​ వరకు బరువు పెరిగారని సీన్ కొన్లీ తెలిపారు. అయితే ఆయనలో కొవ్వు శాతం తగ్గిందని కూడా వెల్లడించారు.

ప్రస్తుతం ట్రంప్ బరువు 244 పౌండ్లు. ఆయన ఎత్తు 6 అడుగుల 3 అంగుళాలు. దీని ప్రకారం చూస్తే ఆయన బాడీ మాస్ ఇండెక్స్ 30.5. నిజానికి బాడీ మాస్ 30 ఉండాలి. అంటే ట్రంప్ ప్రస్తుతం ఊబకాయంతో బాధపడుతున్నట్లు లెక్క. నిజానికి అమెరికాలో 40 శాతం మంది ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు.

ట్రంప్ హృదయ స్పందన రేటు నిమిషానికి 63 బీట్స్​గా ఉంది. సాధారణంగా ఆరోగ్యవంతులైన పెద్ద వయస్సులో వారి హృదయ స్పందన నిమిషానికి 60 నుంచి 100 బీట్స్ వరకు ఉంటుంది.

ట్రంప్ రక్తపోటు (బీపీ) 121-79గా ఉంది. రక్తపోటు సాధారణంగా 120 నుంచి 80 వరకు ఉండొచ్చు.

సైడ్ ఎఫెక్ట్స్​

కరోనా నియంత్రణ కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్​ వాడుతున్నప్పటికీ... దాని వల్ల పెద్దగా ఉపయోగం లేదని పరిశోధనల్లో తేలింది. హైడ్రాక్సీక్లోరోక్విన్ హాని కలిగించనప్పటికీ, 40 శాతం వరకు దుష్ప్రభావాలు చూపించవచ్చని, తేలికపాటి ఉదర సంబంధ ఇబ్బందులు కలుగవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. మరో వైపు హైడ్రాక్సీక్లోరోక్విన్​ కంటే ప్లేసిబో మాత్రలు మంచిగా పనిచేస్తున్నాయని న్యూ ఇంగ్లాండ్​ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ప్రకటించింది.

ట్రంప్ జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు ప్రతి రోజూ ఆస్పిరిన్ తీసుకుంటారు. నిజానికి ఈ ఔషధం గుండె పోటును కూడా నివారించగలుగుతుంది.

ఇదీ చూడండి: మహాత్ముని విగ్రహానికి అమెరికాలో అగౌరవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.