ETV Bharat / international

చలికాలంలో ఉపరితలాలపై ఎక్కువసేపు కరోనా!

కరోనా మనుగడకు సంబంధించి అమెరికా శాస్త్రవేత్తలు కీలక పరిశోధనలు చేశారు. చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్న నేపథ్యంలో ఉపరితలంపై కరోనా ఎక్కువసేపు మనుగడ సాగిస్తుందని తేల్చారు. తడి, పొడి, తేమ పరిస్థితుల్లో వైరస్ తీరుతెన్నులపై అధ్యయనాలు జరిపారు.

author img

By

Published : Dec 20, 2020, 7:40 AM IST

Updated : Dec 20, 2020, 8:57 AM IST

covid-19 virus remains more time on substances in winter season
చలికాలంలో ఉపరితలాలపై ఎక్కువసేపు కరోనా!

శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్న నేపథ్యంలో వస్తువులపై కరోనా వైరస్​ ఎక్కువసేపు మనుగడ సాగిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఆరు బయట దీని సాంక్రమిక సామర్థ్యంపై పర్యావరణ అంశాల ప్రభావాన్ని అంచనావేయడానికి వారు వైరస్​ను పోలిన రేణువులను ఉపయోగించారు. అమెరికాలోని ఉతా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వీరు వైరస్​ తరహా రేణువుల(వీఎల్​పీ)ను తయారు చేశారు. అవి కరోనా బాహ్య నిర్మాణాన్ని పోలి ఉన్నాయి. కరోనా వైరస్​లో ఉన్నట్లే వీటిలోనూ మూడురకాల ప్రొటీన్లు ఉన్నాయి. ఇన్​ఫెక్షన్​ను కలిగించే ఆర్​ఎన్​ఏ జన్యు పదార్థం మాత్రం లేదు. తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు గాజు ఉపరితలాలపై వీటిని ప్రయోగించారు. పొడి, తేమ పరిస్థితుల్లో వీటి తీరుతెన్నులను గమనించారు. సాధారణంగా కరోనా వైరస్​ ఇన్​ఫెక్షన్ సోకిన వ్యక్తి నుంచి తుమ్ము, దగ్గు, గాఢంగా శ్వాస వదిలేటప్పుడు ఊపిరితిత్తుల నుంచి తుంపర్లు వెలువడుతుంటాయి. వాటిలో వైరస్ రేణువులు ఉంటాయి. ఈ తుంపర్లు వేగంగా ఎండిపోతాయి.

అందువల్ల ఉపరితలాలపై తడి, పొడి వైరస్ రేణువులు ఉంటాయి. తాజాగా శాస్త్రవేత్తలు వేర్వేరు పరిస్థితుల్లో వీఎల్​పీల ఆకృతిలో వచ్చే మార్పులను పరిశీలించారు. తడి, పొడి రేణువులను అరగంట పాటు 33.8 డిగ్రీల సెల్సియస్​ ఉష్ణోగ్రతలో ఉంచారు. ఫలితంగా వాటి బాహ్య నిర్మాణం క్షీణించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. పొడి రేణువులు వేగంగా నశించాయని పేర్కొన్నారు. అందుకు భిన్నంగా.. సాధారణ గది ఉష్ణోగ్రత లేదా శీతల వాతావరణంలో ఉన్నప్పుడు సదరు రేణువులు ఎక్కువసేపు ఇన్​ఫెక్షన్​ కలిగించే స్థాయిలో పటిష్ఠంగా ఉన్నాయని తేల్చారు.

ఇదీ చదవండి : 'అందుకు వేగవంతమైన టీకా పంపిణీ డ్రైవ్​​ అవసరం'

Last Updated : Dec 20, 2020, 8:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.