అమెరికాలో డెల్టా వేరియంట్ విజృంభణతో(Delta Variant In America) కరోనా బాధితులుగా మారుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతున్న వేళ ఊరటనిచ్చే కబురు! అక్టోబర్ నెల చివరినాటికి 5 నుంచి 11 ఏళ్ల వయసు వారికి టీకా(vaccine for children) అందుబాటులోకి వస్తుందని అక్కడి అధికారులు తెలిపారు. ఈ మేరకు 'న్యూయార్క్ టైమ్స్' వార్తా సంస్థకు అమెరికాకు చెందిన ఇద్దరు ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. అమెరికాలో ప్రస్తుతం 12 ఏళ్ల వయసు దాటిన వారికి మాత్రమే టీకాలు అందజేస్తున్నారు.
చిన్నపిల్లల టీకాకు(vaccine for children) సంబంధించిన క్లినికల్ సమాచారంపై పూర్తి స్థాయి సమీక్ష జరపాల్సి ఉంటుందని ఆ దేశ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ మాజీ కమిషనర్, ప్రస్తుత ఫైజర్ వ్యాక్సిన్ బోర్డు సభ్యుడు డాక్టర్ స్కాట్ గాట్లీబ్ తెలిపారు. ఫైజర్ సంస్థ(Pfizer Vaccine For Kids) అభివృద్ధి చేసిన పిల్లల టీకా.. అక్టోబర్ 31 నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఫైజర్ వ్యాక్సిన్ క్లినికల్ సమాచారంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు.
టెక్సాస్‌లోని పిల్లల ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ జేమ్స్ వెర్సాలోవిక్.. గాట్లీబ్తో ఏకీభవించారు. అక్టోబర్ నాటికి పిల్లల టీకా అనుమతి పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు క్లినికల్ ట్రయల్స్‌ను మరింత వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. డెల్టా వేరియంట్(Delta Variant In America) కారణంగా ఆస్పత్రుల్లో చేరే చిన్నారుల సంఖ్య పెరుగుతోందని వివరించారు.
ఇదీ చూడండి: కరోనాతో హై అలర్ట్- ఆ నగరంలో రైళ్లు, బస్సులు బంద్
ఇదీ చూడండి: జూలో 13 గొరిల్లాలకు కరోనా.. వారే కారణం!