ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ పంజా విసురుతూనే ఉంది. తాజాగా 5.1 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. 7,099 మంది కరోనా బారిన పడి మరణించారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 8కోట్ల 55లక్షల కేసులు నమోదయ్యాయి. ఒక కోటి 8లక్షల 50వేల మరణాలు సంభవించాయి. 2 కోట్ల 31లక్షల 98 వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. 6 కోట్ల 4 లక్షల 54 వేల మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 85,504,375
- మరణాలు: 1,850,646
- కోలుకున్నవారు: 60,454,731
- క్రియాశీల కేసులు: 23,198,998
- అమెరికాలో వాక్సిన్ పంపిణీ జరుగుతుండగా.. మరోవైపు కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా లక్షా 94వేల కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం సంఖ్య 2.11 కోట్లకు చేరింది. తాజాగా మరో 1387 మంది మృతితో, మరణాల సంఖ్య 3.6 లక్షలకు పెరిగింది.
- యూకేలోనూ కరోనా విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో 54 వేల కొత్త కేసులు నమోదు కాగా.. 454 మంది మరణించారు.
- రష్యాలో తాజాగా 24,150 కొత్త కేసులు నమోదయ్యాయి. 504 మంది కొవిడ్ ధాటికి మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 32 లక్షలుగా నమోదయ్యాయి.
- బ్రెజిల్లో 17,341 కొత్త కేసులు నమోదయ్యాయి. 276 మంది మరణించారు. మొత్తం కేసులు 77లక్షల 33వేలకు పెరిగాయి. కేసుల సంఖ్య పరంగా భారత్ తర్వాతి స్థానంలో ఉన్న బ్రెజిల్.. మరణాలు మాత్రం ఇక్కడ ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు లక్షా 96వేల మరణాలు సంభవించాయి.
పలు దేశాల్లో కరోనా కేసుల వివరాలు ఇలా...
దేశం | మొత్తం కేసులు | మొత్తం మరణాలు |
అమెరికా | 21,113,528 | 360,078 |
బ్రెజిల్ | 7,733,746 | 196,018 |
రష్యా | 3,236,787 | 58,506 |
ఫ్రాన్స్ | 2,655,728 | 65,037 |
యూకే | 2,654,779 | 75,024 |