ETV Bharat / international

అమెరికాలో కరోనా రికార్డ్​- 24 గంటల్లో 4,591 మరణాలు - కరోనా

అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. వైరస్​ ధాటికి గురువారం ఏకంగా 4,591 మంది మరణించారు. ఒక దేశంలో ఒకే రోజు ఇంతమంది మరణించటం ఇదే తొలిసారి. అటు... ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 21.83లక్షలు దాటింది. మృతుల సంఖ్య 1.46లక్షలకు చేరింది.

COVID-19
అమెరికాలో కరోనా రికార్డ్​
author img

By

Published : Apr 17, 2020, 11:26 AM IST

Updated : Apr 17, 2020, 12:22 PM IST

అగ్రరాజ్యంలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు మృతుల సంఖ్యలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్క రోజే 4,591 మంది ఈ వైరస్​కు బలయ్యారు. కరోనాను గుర్తించిన నాటి నుంచి ఒకే రోజు ఇంతమంది మరణించటం ఇదే తొలిసారి.

అమెరికాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 678,144కి చేరింది. మృతుల సంఖ్య 34,641గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే అత్యధికం. న్యూయార్క్​లో కొవిడ్​-19 ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 226,000కుపైగా కేసులు నమోదయ్యాయి. 16,106 మంది మృతి చెందారు.

* గవర్నర్లకు అధికారాలు..

కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. దశల వారీగా ఆంక్షలు సడలించేందుకు కొత్త మార్గదర్శకాలను ప్రకటించారు. ఆయా రాష్ట్రాల్లో ఆంక్షల సడలింపుపై గవర్నర్లు నిర్ణయం తీసుకునేందుకు అనుమతించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మెరుగుపడిన తర్వాత ఆరోగ్యంగా ఉన్న అమెరికన్లు విధులు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు ట్రంప్​.

* జీ-7 దేశాల భేటీ..

కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జీ-7 కూటమి సభ్యదేశాల అధినేతలతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు ట్రంప్​. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టేందుకు కలిసి పనిచేయాలని నాయకులు అంగీకరించినట్లు తెలిపింది శ్వేతసౌధం.

కరోనా విలయంలోనే ఐరోపా..

ఐరోపాలో కొన్ని ఆశావహ సంకేతాలు ఉన్నప్పటికీ.. కరోనాతో అత్యధికంగా ప్రభావితమైన పలు దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉందని ఐరోపాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయం పేర్కొంది. ఈ ప్రాంతంలో 10 లక్షల మందికి వైరస్​ సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికీ ఐరోపా దేశాలు కరోనా ప్రళయంలోనే కొనసాగుతున్నాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగానికిపైగా ఐరోపా​లోనే ఉన్నట్లు వెల్లడించింది. స్పెయిన్​, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్​, స్విట్జర్లాండ్​ దేశాల్లో కేసుల సంఖ్య తగ్గుదల సంకేతాలు ఉన్నప్పటికీ.. బ్రిటన్​, టర్కీ, ఉక్రెయిన్​, బెలారస్​, రష్యా వంటి దేశాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది.

బ్రెజిల్​ ఆరోగ్య మంత్రిపై వేటు

కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారని.. బ్రెజిల్​ అధ్యక్షుడు జాయిర్‌ బాల్సోనారోపై ఇప్పటికే పలువురు ఆరోగ్య నిపుణులు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు బాల్సోనారో. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఆరోగ్య శాఖ మంత్రి లూయిజ్​ హెన్రిక్​ మాండెట్టాను తొలగించారు. కరోనా కట్టడిలో ఇరువురి మధ్య వచ్చిన అభిప్రాయభేదాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధ్యక్షుడి నిర్ణయాన్ని పలువురు నిపుణులు తప్పుపట్టారు. రానున్న కొద్ది రోజుల్లోనే దేశం కొత్త కేసుల సంఖ్యలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Global COVID-19 tracker
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు

ఇదీ చూడండి: 24 గంటల్లో 23 మరణాలు- 1,007 కొత్త కేసులు

Last Updated : Apr 17, 2020, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.