ETV Bharat / bharat

24 గంటల్లో 23 మరణాలు- 1,007 కొత్త కేసులు - కరోనా మహమ్మారి

దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 1,007 మందికి వైరస్ సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 13 వేలు దాటింది. గత 24 గంటల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

COVID-19
దేశంలో కరోనా మహమ్మారి
author img

By

Published : Apr 17, 2020, 10:04 AM IST

దేశంలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1,007 మందికి కరోనా పాజిటివ్​గా తేలినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

COVID-19
దేశవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు

వెయ్యి కేసులు దాటిన రాష్ట్రాలు..

  • మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రభావం అధికంగా ఉంది. ముంబయిలో కేసుల సంఖ్య 2వేలు దాటిన క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 3,205కు చేరింది. 194 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మంది కోలుకున్నారు.
  • ఆ తర్వాతి స్థానంలో దిల్లీ నిలిచింది. హస్తినలో మొత్తం 1,640 కేసులు నమోదయ్యాయి. 38 మంది మరణించగా.. 51 మంది కోలుకున్నారు.
  • తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 1,267కు చేరింది. 15 మృతిచెందారు. 180 మంది కోలుకున్నారు.
  • రాజస్థాన్​లో మొత్తం కేసులు 1,131కి చేరాయి. ముగ్గురు మరణించగా.. 164 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
  • మధ్యప్రదేశ్​లో 1,120 మంది కరోనా బారిన పడ్డారు. 53 మంది మరణించారు. 64 మంది కోలుకున్నారు. ఉత్తర్​ప్రదేశ్​లో కరోనా కేసుల సంఖ్య 805కు చేరింది. దేశంలో తొలి కరోనా కేసు నమోదైన కేరళలో కేసుల సంఖ్య 395కు చేరింది.

ఇదీ చూడండి: కరోనా వేళ 'ఆయుష్‌' పెంచుకొనే మార్గాలివే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.