ETV Bharat / sukhibhava

కరోనా వేళ 'ఆయుష్‌' పెంచుకొనే మార్గాలివే..

ధృడమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు కరోనాపై పోరాడి గెలవడం సాధ్యమేనని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తి పెంచుకునే దిశగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశ ప్రజలకు ఈ దిశగా పలు సూచనలు చేసింది.

corona ayush
కరోనా వేళ.. ఆయుష్‌ పెంచుకోండిలా
author img

By

Published : Apr 17, 2020, 9:14 AM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

వైరస్‌ ఏదైనా దాన్ని ఎదుర్కోవాలంటే మనలో రోగ నిరోధక శక్తి కీలకం. కరోనా వ్యాప్తి వేళ ఇది మరింత అవసరం. అందుకోసం ఆయుష్‌ మంత్రిత్వ శాఖ దేశ ప్రజలకు సూచనలు చేసింది. లాక్‌డౌన్‌ వేళ అందరూ ఈ సూచనలు పాటించాలని ప్రధాని మోదీ కూడా పిలుపునిచ్చారు.

సాధారణ జాగ్రత్తలు

నిత్యం కనీసం అర గంట పాటు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయాలి.

corona ayush
వ్యాయామం

రోజంతా గోరువెచ్చని నీటినే తాగాలి.

corona ayush
గోరువెచ్చని నీరు

మీ వంటకాలలో పసుపు, జీలకర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి ఉండేలా చూడండి.

corona ayush
సుగంధ దినుసులతో ఆరోగ్యం..

ఆయుర్వేద శక్తి కోసం..

ఉదయాన్నే ఓ టీ స్పూన్‌ చవన్‌ప్రాష్‌ (10 గ్రాములు) తీసుకోండి. మధుమేహం ఉన్నవారైతే షుగర్‌ ఫ్రీ చవన్‌ప్రాష్‌ వాడాలి.

corona ayush
చవన్​ ప్రాష్

తులసి, దాల్చిన చెక్క, మిరియాలు, శొంఠి, ఎండుద్రాక్ష(కిస్‌మిస్‌)తో చేసిన టీ రోజుకు ఒకట్రెండు సార్లు తాగండి. కావాలంటే బెల్లం, నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.

corona ayush
ఆయుర్వేద టీ

150 మిల్లీలీటర్ల వేడి పాలలో అర చెంచా పసుపు వేసుకొని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తాగండి.

corona ayush
పసుపు పాలు

తేలికపాటిగా..

నువ్వుల నూనె, కొబ్బరి నూనె, నెయ్యిలో ఏదో ఒకటి నాసిక రంధ్రాల్లో కాసేపు పట్టించి ఉంచండి. రోజూ ఉదయం, సాయంత్రం ఇలా చేయాలి.

ఆయిల్‌ పుల్లింగ్‌ థెరపీ: ఓ చెంచా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను నోటిలో పోసుకుని 2-3 నిమిషాల పాటు పుక్కిలించాలి. తర్వాత వేడి నీటితో పుక్కిలించాలి. రోజూ ఒకట్రెండు సార్లు ఇలా చేయవచ్చు.

పొడి దగ్గు/ గొంతులో మంట ఉంటే..

వేడినీటిలో తాజా పుదీన ఆకులు లేదా సోంపు కలిపి ఆవిరి పీల్చాలి.

గొంతులో గరగరకి లవంగాల పొడిని బెల్లం, తేనెతో కలిపి తీసుకోవాలి.

దగ్గు తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

వీలును బట్టి ఈ సూచనల్లో ఎన్నైనా పాటించవచ్చు.

ఇదీ చూడండి: కరోనా వేళా కాల్పుల మోత.. వేడెక్కిన సరిహద్దులు

Last Updated : May 21, 2020, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.