ETV Bharat / international

'కరోనా కోసం ఆ 2 మందులు కలిపి వాడితే గుండెకు ముప్పు'

కొవిడ్​-19 రోగులకు చికిత్స అందించేందుకు మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్​తో పాటు యాంటిబయోటిక్​ అజిత్రోమైసిన్​ వినియోగిస్తే గుండె సమస్యలు పెరుగుతాయని ఓ నివేదిక పేర్కొంది.ఈ ఔషధాలతో కరోనా రోగులకు చికిత్స అందించే వైద్యులకు పలు సూచనలు చేశారు కార్డియాలజిస్టులు. ఇదే సమయంలో వైరస్​ బాధితులపై హైడ్రాక్సీక్లోరోక్విన్​ మంచి ఫలితాలను ఇస్తోందన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.

Hydroxychloroquin
'హైడ్రాక్సీక్లోరోక్విన్​-అజిత్రోమైసిన్​ వాడకం గుండెకు ప్రమాదం'
author img

By

Published : Apr 4, 2020, 11:00 AM IST

కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల మంది ఈ వైరస్​ బారిన పడుతున్నారు. వైరస్​ సోకిన వారిపై మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్​ మంచి ప్రభావం చూపుతోందని కొందరు వైద్యులు విశ్వసిస్తున్నారు. అయితే.. హైడ్రాక్సీక్లోరోక్విన్​తో పాటు యాంటిబయోటిక్ అజిత్రోమైసిన్​ను వినియోగిస్తే గుండెకు ముప్పు పెరుగుతుందని ఓ నివేదిక హెచ్చరిస్తోంది. ఈ ఔషధాలను వినియోగించే క్రమంలో జాగ్రత్తలు వహించాలని.. లేదంటే హృదయ స్పందనల్లో ఇబ్బందులు తలెత్తుతాయని వెల్లడించింది.

అమెరికా న్యూయార్క్​లోని కార్డియాలజీ కళాశాలకు చెందిన మాగజైన్​లో ఈ పరిశోధన ప్రచురితమైంది. ఒరెగావ్​ హెల్త్​ అండ్​ సైన్స్​ విశ్వవిద్యాలయం(ఓహెచ్​ఎస్​యూ), ఇండియానా విశ్వవిద్యాలయానికి చెందిన కార్డియాలజిస్టులు.. హైడ్రాక్సీక్లోరోక్విన్​, అజిత్రోమైసిన్​ వాడకాలపై పరిశోధన చేశారు. కొవిడ్​-19 రోగులకు మలేరియా-యాంటిబయోటిక్​ మందుల కలయికతో చికిత్స అందిస్తున్న వైద్యులకు పలు సూచనలు చేశారు. ఈ 2 మందుల్ని కలిపి ఉపయోగిస్తే గుండె గదులు మూసుకుపోవటం, సక్రమంగా కొట్టుకోకపోవటం లేదా కొన్ని సందర్భాల్లో ఆగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

" కొవిడ్​-19 చికిత్సకు హైడ్రాక్సీక్లోరోక్విన్​, అజిత్రోమైసిన్​ ప్రభావం చూపుతున్నాయనే దానిపై ప్రస్తుతానికి చాలా తక్కువ సమాచారం ఉంది. అయినప్పటికీ.. కొంతమంది వైద్యులు కరోనా చికిత్సకు వీటిని ఉపయోగించేందుకు మొగ్గు చూపుతున్నారు. కరోనా రోగులకు ఈ ఔషధాలను వినియోగించాలనుకునే వైద్యులు వాటి దుష్ప్రభావాలను తెలుసుకోవాలని కోరుతున్నాం. "

- ఎరిక్​ స్టెక్కెర్​, ఓహెచ్​ఎస్​యూ అసోసియేట్​ ప్రొఫెసర్​

ఈ ఔషధాలను వినియోగించే క్రమంలో రోగుల గుండె స్పందనల్లో మార్పులను గమనిస్తూ ఉండాలని సూచించారు నిపుణులు.

హైడ్రాక్సీక్లోరోక్విన్​తో మంచి ఫలితాలు: ట్రంప్​

కరోనా సోకిన రోగులపై దశాబ్దాల కాలం నాటి మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్​ మంచి ఫలితాలను ఇస్తోందన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. దీన్ని ఒక అసాధారణ విషయంగా పేర్కొన్నారు. హైడ్రాక్సీక్లోరోక్విన్​ ఔషధాల కొరత లేదని తెలిపారు. కరోనా వైరస్​ నిరోధానికి, చికిత్సకు సంబంధించి హైడ్రాక్సీక్లోరోక్విన్ ప్రభావం​, ఇతర థెరపీలపై పరిశోధన చేస్తున్నామని.. దీనిపై అమెరికా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామన్నారు ట్రంప్​.

ఇదీ చూడండి: కరోనాపై యాంటీ మలేరియా డ్రగ్ మెరుగ్గా పనిచేయదట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.