ETV Bharat / international

సీడీఎస్ రావత్​ దుర్మరణంపై చైనా, పాక్ రియాక్షన్​ ఇలా... - సీడీఎస్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం

Countires reaction on cds death: భారత త్రిదళపతి జనరల్ బిపిన్ రావత్ మృతిపట్ల వివిధ దేశాలు విచారం వ్యక్తం చేశాయి. భారత్​-అమెరికా రక్షణ సంబంధాలను మెరుగుపరచడంలో జనరల్ రావత్ కీలక పాత్ర పోషించారని అమెరికా పేర్కొంది. జనరల్ రావత్ మృతిపట్ల ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

world reaction on cds general bipin rawat death
సీడీఎస్​​ మృతిపై ప్రపంచ దేశాల దిగ్భ్రాంతి
author img

By

Published : Dec 9, 2021, 11:26 AM IST

Countires reaction on cds death: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో త్రిదళాధిపతి(సీడీఎస్​)​ జనరల్ బిపిన్ రావత్ ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అమెరికా, రష్యా, చైనా, పాకిస్థాన్​ సహా వివిధ దేశాలు విచారం వ్యక్తం చేశాయి. భారత రక్షణ రంగంలో రావత్ చేసిన సేవలను స్మరించుకున్నాయి. ఆయన కుటుంబాలను, ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇతర అధికారుల కుటుంబాలకు సంతాపం తెలిపాయి. రావత్ మృతి పట్ల అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

"భారత్ సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్​, ఆయన సతీమణి, ఇతర అధికారుల మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. భారత్​-అమెరికా రక్షణ సంబంధాలను మెరుగుపరచడంలో అసాధారణమైన నేతగా మేం జనరల్​ రావత్​ను గుర్తించుకుంటాం.

-ఆంటోని బ్లింకెన్, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి.

"అమెరికా, భారత్ రక్షణ భాగస్వామ్యంలో జనరల్ బిపిన్ రావత్​ చెరగని ముద్ర వేశారు. భారత సాయుధ దళాలను మరింత యుద్ధ సన్నద్ధులుగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. నా తరఫున, అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ తరపున రావత్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను."

-లాయిడ్ ఆస్టిన్, అమెరికా రక్షణ మంత్రి.

జనరల్ రావత్ తమకు అత్యంత విలువైన భాగస్వామి అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. భారత్- అమెరికా రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆయన ఎంతో సాయం చేశారని చెప్పారు.

Un secretary general on cds Bipin Rawat death

భారత సీడీఎస్ జనరల్ రావత్ సహా హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన జనరల్ బిపిన్ రావత్ ఆయన సతీమణి సహా ఇతర అధికారుల కుటుంబాలకు, ప్రజలకు, భారత ప్రభుత్వానికి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు గుటెరస్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్​ వెల్లడించారు. కాంగోలో యూఎన్ పీస్ కీపింగ్ మిషన్​ 2008, 2009లో రావత్ సేవలను గుటెరస్​ స్మరించుకున్నారని వెల్లడించారు.

విదేశీ రాయబారుల సంతాపం..

రావత్ కుటుంబ సభ్యులు సహా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇతర అధికారుల కుటుంబ సభ్యులకు దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రగాఢ సానుభూతి తెలిపింది. అమెరికాకు బలమైన స్నేహితుడు, భాగస్వామి రావత్ అని పేర్కొంది. అమెరికా సైన్యంతో భారత రక్షణ సహకారాలను విస్తృతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడింది.

China on CDS Bipin Rawat demise

సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఆయన సతీమణి మధులికా రావత్ సహా హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఇతర అధికారుల మృతి పట్ల భారత్​కు చైనా రాయబారి సన్ వీయ్​డాంగ్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "జనరల్ బిపిన్​ రావత్​ కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి అని ఆయన పేర్కొన్నారు.

Nepal pm on CDS Bipin Rawat death

సీడీఎస్ హెలికాప్టర్​ ప్రమాద దుర్ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్​ దేవ్​బా పేర్కొన్నారు. "మృతుల కుటుంబాలకు, భారత సాయుధ దళాలకు నా ప్రగాఢ సానుభూతి" అని ఆయన పేర్కొన్నారు.

తెలివైన వ్యక్తి, ధైర్యవంతుడైన సైనికుడిని భారత్ కోల్పోయిందని బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎలిస్ ట్వీట్ చేశారు.

గొప్ప దేశభక్తుడు, దేశ సేవలో నిబద్ధుడైన హీరోను భారత్ కోల్పోయిందని భారత్​కు రష్యా ప్రతినిధి నికోలయ్ కుదశేవ్ తెలిపారు.

Pakistan on cds death

"సీడీఎస్ బిపిన్ రావత్ మృతిపట్ల పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన(సీజేసీఎస్​సీ) జనరల్ నదీమ్ రజా, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్​ జనరల్ ఖామర్ జావేద్ బజ్వా తమ సానుభూతి తెలిపారు" అని పాకిస్థాన్ సైనిక ప్రతినిధి ఒకరు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. జనరల్​ రావత్​ మృతి పట్ల పాకిస్థాన్​ ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబెర్ సిద్ధు సంతాపం తెలిపారు.

వీరితో పాటు ఇజ్రాయెల్, సింగపూర్, జర్మన్ ప్రతినిధులు కూడా సీడీఎస్ బిపిన్ రావత్ మృతి పట్ల సంతాపం తెలియజేశారు.

Cds general helicopter crash: తమిళనాడులోని కోయంబత్తూర్​-కూనూర్​ మధ్యలో హెలికాప్టర్​ ప్రమాదానికి గురై భారత త్రిదళాధిపతి(సీడీఎస్​) జనరల్​ బిపిన్​ రావత్ దుర్మరణం చెందారు. వెల్లింగ్టన్​ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 14 మందికిగాను 13 మంది చనిపోయినట్లు వాయుసేన ప్రకటించింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.