ETV Bharat / international

అమెరికాలో 30 లక్షలు దాటిన కరోనా కేసులు - అమెరికాలో కరోనా వైరస్

ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్​ కేసుల సంఖ్య 1.17 కోట్లకు చేరింది. ఇప్పటివరకు 5,40,105 మంది కరోనా బారిన పడి​ ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో 30 లక్షల మందికిపైగా కరోనా బారిన పడగా.. బ్రెజిల్​, పాక్​, రష్యా, చిలీ, మెక్సికో, పెరులో కేసులు నానాటికీ పెరుగుతున్నాయి.

Corona
అమెరికా
author img

By

Published : Jul 7, 2020, 7:59 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. చాలా దేశాలు వైరస్ ధాటికి చిగురుటాకులా వణికిపోతున్నాయి. అమెరికా, బ్రెజిల్​ దేశాల్లో భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.

Corona
దేశాలవారీగా కేసుల వివరాలు

అమెరికాలో ఉద్ధృతంగా..

అగ్రరాజ్యంలో కరోనా వైరస్ తీవ్రత ఏమాత్రం తగ్గట్లేదు. రోజూ భారీ సంఖ్యలో కరోనా వైరస్​ బారిన పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో 50,262 కేసులు నమోదు కాగా.. మొత్తం సంఖ్య 30 లక్షలకు చేరింది. కరోనా ధాటికి 1,32,961 మంది మరణించారు.

దక్షిణ అమెరికాలో..

బ్రెజిల్​లో నెమ్మదిగా మొదలైన కరోనా వ్యాప్తి ఊహకందని రీతిలో విజృంభించింది. పాజిటివ్​ కేసుల సంఖ్యలో అమెరికా తర్వాతి స్థానంలో ఉన్న బ్రెజిల్​లో తాజాగా 21 వేల మందికి కరోనా సోకింది. మొత్తం కేసుల సంఖ్య 16.26 లక్షలకు చేరింది. వైరస్ బారిన పడి ఇప్పటివరకు 65 వేల మంది మృతి చెందారు.

దక్షిణ అమెరికాలోని పెరు, చిలీ, అర్జెంటీనాల్లోనూ కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఈ దేశాల్లో మృతుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది.

ఆసియా దేశాల్లో..

పాకిస్థాన్​లో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 3 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. పాక్​లో చాలా మంది ప్రజాప్రతినిధులు, ప్రముఖ వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. ఆ దేశ ఆరోగ్య మంత్రికి కూడా తాజాగా కరోనా పాజిటివ్​గా తేలింది.

సౌదీ అరేబియా, బంగ్లాదేశ్​, ఇరాన్​, టర్కీ, ఫిలిప్పీన్స్​ దేశాల్లోనూ వైరస్ విజృంభణ కొనసాగుతోంది.

ఐరోపాలో ఇలా..

రష్యాలో కరోనా వైరస్​ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. ఒక్కరోజులో 6,6112 కేసులు నమోదు కాగా.. మొత్తం సంఖ్య 6.87 లక్షలకు చేరింది. అయితే రష్యాలో మరణాల రేటు తక్కువగా ఉంది. ఇప్పటివరకు ఆ దేశంలో 10,296 మంది మృత్యువాత పడ్డారు.

ఇదీ చూడండి: 'మాస్క్ ధరించడం​ తప్పనిసరిపై ఆదేశాలు ఇవ్వలేం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.