కరోనా మహమ్మారి మానవాళి క్రమంగా కబలిస్తోంది. అమెరికా, బ్రెజిల్, రష్యాలు వైరస్ ప్రభావంతో విలవిలలాడుతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 64 లక్షల 85 వేల మందికి పైగా వైరస్ బారినపడ్డారు. 3 లక్షల 82 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా విలవిల..
అమెరికాపై వైరస్ ప్రభావం మరింత తీవ్రమవుతోంది. కరోనా ధాటికి ఇప్పటి వరకు అగ్రరాజ్యంలో 1 లక్షా 8 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా... 18 లక్షల 81 వేల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతితో చెలరేగిన నిరసనలతో వైరస్ మరింతగా వ్యాపించే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
బ్రెజిల్లో సడలింపులు..
వైరస్ కేసుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్లో... లాక్డౌన్ సడలింపులు ఇచ్చారు. బ్రెజిల్లో తాజాగా 1,569 కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 5,58,237కి పెరిగింది. కాగా కొత్తగా 31 మంది వైరస్ బారిన పడి మరణించారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య 31 వేల 309కి పెరిగింది.
మెక్సికో
మెక్సికోలో కొత్తగా 3 వేల 891 పాజిటివ్ కేసులు, 470 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీనితో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 97,326; మరణాల సంఖ్య 10,637 దాటింది.
ఇదీ చూడండి: జాతి వివక్షపై అట్టుడుకుతున్న అగ్రరాజ్యం