ETV Bharat / international

సమన్వయమే వ్యాక్సిన్ తయారీకి సరైన వ్యూహం!

author img

By

Published : May 13, 2020, 3:31 PM IST

కొవిడ్-19ను నిర్మూలించే వ్యాక్సిన్ అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య సహకారం అత్యావశ్యకమని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. వైరస్​ నుంచి మానవాళి కాపాడేందుకు సురక్షితమైన వ్యాక్సిన్ ప్రజలందరికీ పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. పరిశోధనాభివృద్ధిలో వ్యూహాత్మక సరళిని పాటించాలని పిలుపునిచ్చారు.

coronavirus vaccine
కరోనా టీకా

క్లినికల్ టెస్టింగ్​లో సంయుక్త భాగస్వామ్య విధానాలు, వ్యాక్సిన్​ను పెద్ద ఎత్తున తయారు చేసి పంపిణీ చేయడం వంటి అంశాలు కొవిడ్-19ను నివారించడంలో ముఖ్య భూమిక పోషిస్తాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒకటి కన్నా ఎక్కువ వ్యాక్సిన్ తయారీ విధానాలే 'సార్స్​-సీఓవీ-2' నుంచి ప్రపంచ మానవాళిని కాపాడే అవకాశం ఉందన్నారు. పరిశోధన, అభివృద్ధిలో వ్యూహాత్మక సరళి పాటించడం ద్వారా ఒకేసారి పలు వ్యాక్సిన్ క్యాండిడెట్లను తయారు చేసేందుకు అవసరమైన సమాచారం లభిస్తుందని పేర్కొన్నారు.

ఈ మేరకు అమెరికా నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ ఎస్ కొలిన్స్, నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్​ఫెక్టియస్ డిసీజెస్ డైరెక్టర్ ఆంటోని ఫాచి, సీయాటెల్​లోని ఫ్రెడ్ హచిన్సన్ క్యాన్సర్ రీసర్చ్ సెంటర్ ప్రొఫెసర్ లారెన్స్ కోరే, ఎన్​ఐఏఐడీ వ్యాక్సిన్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ మాస్కోలా.. సైన్స్ జర్నల్​లో తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

పెద్ద ఎత్తున తయారీ అవసరం

వివిధ వ్యాక్సిన్ విధానాల లక్షణాలు రూపొందించడానికి వ్యాక్సిన్ క్యాండిడేట్స్ కీలకంగా వ్యవహరిస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ జనసమూహాన్ని కరోనా వైరస్​ నుంచి రక్షించడానికి సురక్షితమైన వ్యాక్సిన్​ను పెద్ద ఎత్తున తయారుచేసి పంపిణీ చేయాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పారు.

కొవిడ్​-19ను సమర్థంగా ఎదుర్కొనే రోగ నిరోధక వ్యవస్థ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సురక్షితమైన విధానాలు పాటిస్తూ క్యాండిడేట్ వ్యాక్సిన్ల ట్రయల్స్ ఎలా నిర్వహించాలన్న విషయాన్ని వివరించారు.

టీకా ఉత్పత్తి సహా క్లినికల్ పరీక్షను సమన్వయం చేసుకోవడానికి పలు నిర్దిష్ట విధానాలను ప్రతిపాదించారు. సాధారణ క్లినికల్ ట్రయల్స్ డిజైన్లు, క్లినికల్ ఎండ్​ పాయింట్లు, డేటా సేఫ్టీ అండ్ మానిటరింగ్ బోర్డ్, ప్రామాణిక రోగ నిరోధక పరీక్షల వంటి విధానాలను ప్రస్తావించారు.

సహకారమే పరమావధి!

కొవిడ్-19 వ్యాక్సిన్​ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున సహకారం అవసరమని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. మొత్తం జనాభా కోసం భారీ స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలని అన్నారు. ఈ సామర్థ్యం పెంపొందించుకోవడానికి బయోఉత్పత్తి, మౌలిక సదుపాయాల రంగాలకు నిధులు సమకూర్చాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. వ్యాక్సిన్ తయారీ, ధర, పంపిణీ వ్యవస్థలలో ఉన్న అవరోధాలను గమనించాలని వ్యాఖ్యానించారు. కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య భాగస్వామ్యం అత్యావశ్యకమని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.