అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై లైంగిక ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా న్యూయార్క్‌కు చెందిన ఈ జీన్ కారోల్ అనే కాలమిస్ట్ ట్రంప్ తనపై రెండు దశాబ్దాల క్రితం లైంగిక దాడి చేసినట్లు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. అవాస్తవమైన ఆరోపణలంటూ కొట్టిపారేశారు.
కారోల్ తన కొత్త పుస్తకం 'వాట్ డు వీ నీడ్ మెన్ ఫర్?'లో ట్రంప్ తనను వేధించారని, అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 1990ల్లో స్థిరాస్తి వ్యాపారిగా ఉన్న ట్రంప్‌తో తనకు పరిచయం ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు. ఒక రోజు డిపార్ట్మెంటల్ స్టోర్ డ్రెస్సింగ్ రూంలో ఉన్న తనతో ట్రంప్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపించారు.
అయితే ఈ విషయాన్ని తన స్నేహితులకు చెబితే, ట్రంప్ పలుకుబడి ఉన్న వ్యక్తి అయినందున పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండదని సూచించినట్లు ఆమె చెప్పుకొచ్చారు.
తప్పుడు ఆరోపణలు
కారోల్ ఆరోపణలను అధ్యక్షుడు ట్రంప్ కొట్టిపారేశారు. తాను ఆమెను ఎప్పుడూ చూడలేదని స్పష్టం చేశారు. ఆమె ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని డిపార్ట్మెంటల్ స్టోర్ యాజమాన్యం తెలిపిందని అన్నారు. వ్యక్తిగత ప్రచారం, పుస్తకాల విక్రయాలు, రాజకీయ లబ్ధి కోసం కొందరు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: 'పిలాటస్' ఒప్పందంలో అవినీతిపై సీబీఐ కేసు