ETV Bharat / international

ఎట్టకేలకు యూఎఫ్​ఓల రహస్య సమాచారం విడుదల - international news latest

అమెరికా ప్రభుత్వం రహస్యంగా దాచిపెట్టిన యూఎఫ్‌ఓల సమాచారాన్ని సీఐఏ ఎట్టకేలకు బయటపెట్టింది. 1980 నుంచి ఇప్పటి వరకు యూఎఫ్‌ఓల ఉనికి, వాటికి సంబంధించిన వివరాలతో 2,780 పేజీల సమాచారాన్ని సీడీ రూపంలో విడుదల చేసింది. 2004, 2015లో ఆకాశంలో యూఎఫ్‌ఓలు కనిపించడం నిజమేనని ఇటీవల పెంటగాన్‌లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ డిఫెన్స్‌ వెల్లడించడం యూఎఫ్‌ఓలపై ప్రజల్లో ఆసక్తి మరింత పెరిగింది.

cia-released-details-about-ufos
ఎట్టకేలకు యూఎఫ్​ఓల రహస్య సమాచారం విడుదల
author img

By

Published : Jan 17, 2021, 6:10 AM IST

కొన్ని దశాబ్దాలుగా కొలిక్కి రాని విషయాల్లో యూఎఫ్‌ఓ(అన్‌ఐడెంటిఫైడ్‌ ఫ్లైయింగ్‌ ఆబ్జెక్ట్స్‌)లు ఒకటి. చాలా కాలంగా వీటి గురించి చర్చ జరుగుతూనే ఉంది. పలుచోట్ల ఈ యూఎఫ్‌ఓలు కనిపించాయని పలువురు చెప్పడం, 2004, 2015లో ఆకాశంలో యూఎఫ్‌ఓలు కనిపించడం నిజమేనని ఇటీవల పెంటగాన్‌లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ డిఫెన్స్‌ వెల్లడించడంతో యూఎఫ్‌ఓలపై ప్రజల్లో ఆసక్తి మరింత పెరిగింది. కానీ, యూఎఫ్‌ఓలకు సంబంధించి అనేక విషయాలను అమెరికా ప్రభుత్వం రహస్యంగా దాచిపెట్టింది. అయితే, ప్రభుత్వం దాచిన ఆ వివరాలను సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ(సీఐఏ) ఇటీవల బయటపెట్టింది. 1980 నుంచి ఇప్పటి వరకు యూఎఫ్‌ఓల ఉనికి, వాటికి సంబంధించిన వివరాలతో 2,780 పేజీల సమాచారాన్ని సీడీ రూపంలో విడుదల చేసింది.

బ్లాక్‌వాల్ట్‌ అనే సంస్థ కొన్నేళ్లుగా యూఎఫ్‌ఓల సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వంతో పోరాడుతోంది. గతంలో కొన్ని వివరాలు సేకరించినప్పటికీ పూర్తి సమాచారం లభించలేదు. దీంతో బ్లాక్‌వాల్ట్‌ వ్యవస్థాపకుడు జాన్‌ గ్రీన్‌వాల్డ్‌ మరోసారి ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ చట్టం కింద ప్రభుత్వం వద్ద ఉన్న యూఎఫ్‌ఓ వివరాలను వెల్లడించాలని దరఖాస్తు చేశాడు. దీనిపై స్పందించిన సీఐఏ ఎట్టకేలకు వివరాలు విడుదల చేసింది. వాటిని గ్రీన్‌వాల్డ్‌ తన బ్లాక్‌వాల్ట్‌ వెబ్‌సైట్‌లో పొందుపర్చాడు. సీఐఏ.. ఔట్‌డేటెడ్‌ సీడీల రూపంలో సమాచారం ఇచ్చిందని, వాటిని పీడీఎఫ్‌ సహా వివిధ ఫార్మాట్లలోకి మార్చి అందుబాటులోకి తెచ్చామని బ్లాక్‌వాల్ట్‌ సంస్థ పేర్కొంది.

ఇదీ చూడండి: 'మహారాణి ఎలిజబెత్​ను​ ఆదర్శంగా తీసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.