చైనాకు చెందిన కరోనా టీకా 'కరోనావ్యాక్' క్లినికల్ ట్రయల్స్‌ను బ్రెజిల్ ఆరోగ్య శాఖ నిలిపివేసింది. ఈ టీకా ప్రయోగాలు ప్రమాదకరమని ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ వ్యాక్సిన్‌ను చైనా ఫార్మా సంస్థ సినోవాక్ అభివృద్ధి చేసింది. దీనిని బ్రెజిల్లో బూటానన్ సంస్థ ఉత్పత్తి చేస్తుంది. అయితే, బ్రెజిల్ ఆరోగ్య శాఖ ప్రకటనపై బూటానన్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ విషయంపై మంగళవారం మీడియా సమావేశం నిర్వహిస్తామని తెలిపింది.
బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సొనారో వ్యాఖ్యలతో కరోనావ్యాక్ టీకాపై వివాదం చెలరేగింది. టీకా సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేసిన బోల్సొనారో.. బ్రెజిల్ ప్రజలు జంతువులు కారని మండిపడ్డారు.
ఇదీ చూడండి: 2021కల్లా చైనా 'కరోనా వ్యాక్సిన్'!