ETV Bharat / international

చైనాకు మిత్ర దేశాలు లేవు: అమెరికా

అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్​ ఆస్టిన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాకు మిత్రులు ఎవరూ లేరని.. అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల మద్దతు ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇండో పసిఫిక్​ ప్రాంతంలోని దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు.

lloyd austin, అమెరికా రక్షణ శాఖ మంత్రి
చైనాపై అమెరికా రక్షణ శాఖ మంత్రి
author img

By

Published : May 28, 2021, 10:37 AM IST

అమెరికాకు ప్రధాన ప్రత్యర్థి అయిన చైనాకు ఏ దేశాల మద్దతూ లేదని.. తమకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మిత్రదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు అగ్రరాజ్యం రక్షణ శాఖ మంత్రి లాయిడ్​ ఆస్టిన్. చైనాను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రక్షణ శాఖకు బడ్జెట్​ కేటాయింపులకు సంబంధించి జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

"చైనాకు మిత్రులు ఎవరూ లేరు. మనకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల మద్దతు ఉంది. ముఖ్యంగా ఇండో పసిఫిక్​ ప్రాంతంలోని దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇది మనకు మరింత బలం చేకూరుస్తున్న విషయం. బంధం బలోపేతం చేసుకునేందుకు ఇటీవల ఆ దేశాల్లో పర్యటించాం కూడా. సైబర్​ స్పేస్​లో అగ్రగామిగా నిలిచేందుకు చైనా అడుగుల వేస్తున్న విషయం తెలిసిందే. అమెరికా కూడా అదే స్థాయి పోటీని ఇస్తుందని భావిస్తున్నాను."

-లాయిడ్​ ఆస్టిన్, రక్షణ మంత్రి

చట్టాన్ని ప్రతిపాదించండి..

ప్రపంచంలో అతిపెద్ద అంతర్జాతీయ మేరీటైమ్ వార్​ఫేర్​ ఎక్సర్​సైజ్​గా పేరుగాంచిన రిమ్​ ఆఫ్​ ది పసిఫిక్​లో చైనా పాల్గొనకుండా అమెరికా అడ్డుకుంటోంది. అయితే ప్రస్తుతం దీనిపైనే మరో ప్రతిపాదన తెచ్చారు ఓ చట్టసభ్యుడు. చైనా ముస్లింలపై పాల్పడిన అఘాయిత్యాలకు వివరణ ఇచ్చే వరకు రిమ్​ ఆఫ్​ ది పసిఫిక్​లో​ పాల్గొనేందుకు అవకాశం ఇవ్వకూడదన్నారు. ఈ మేరకు ఓ బిల్లును రూపొందించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి : అమెరికా జాతీయ భద్రతా సలహాదారుతో జైశంకర్ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.