ETV Bharat / international

'అమెరికా రహస్యాలను చైనా దోచేస్తోంది'

ప్రపంచానికి చైనా అతిపెద్ద ముప్పు అని అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జాన్‌ ర్యాట్‌క్లిఫ్ అన్నారు. అగ్రరాజ్యం రహస్యాలను దొంగిలించి ఎదగాలని, మార్కెట్లో యూఎస్‌ సంస్థల స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తోందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కు రాసిన వ్యాసంలో వెల్లడించారు. త్వరలో గద్దెనక్కనున్న బైడెన్‌ ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేందుకు డ్రాగన్‌దేశం ఆసియాపై సైనికదాడికి దిగే అవకాశముందని హెచ్చరించారు.

China-greatest-threat-to-democracy-freedom-since-WW-II-Trumps-intelligence-chief
రహస్యాలు దోచేస్తున్న చైనా!
author img

By

Published : Dec 5, 2020, 6:33 AM IST

స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి చైనా అతిపెద్ద ముప్పని అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జాన్‌ ర్యాట్‌క్లిఫ్‌ అభిప్రాయపడ్డారు. ఆర్థిక, సైనిక, సాంకేతిక రంగాల్లో అమెరికాపై ఆధిపత్యం చెలాయించాలనే ఉద్దేశంతో రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి అది ఘర్షణకు దిగుతోందని పేర్కొన్నారు. అగ్రరాజ్యం రహస్యాలను దొంగిలించి ఎదగాలని, మార్కెట్లో యూఎస్‌ సంస్థల స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తోందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కు రాసిన వ్యాసంలో వెల్లడించారు.

అమెరికా మేధో హక్కులను దొంగిలించడంతోనే ట్రంప్‌ సర్కారు చైనా వస్తువులు, ఉత్పత్తులపై విపరీతమైన పన్నులు, టారిఫ్‌లు విధించిందని ర్యాట్‌క్లిఫ్‌ అన్నారు. 'అమెరికానే కాదు ప్రపంచం మొత్తం మీద ఆర్థిక, సైనిక, సాంకేతిక రంగాల్లో ఆధిపత్యం చెలాయించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. చైనా కమ్యూనిస్టు పార్టీకి అనుగుణంగానే అనేక చైనా కంపెనీలు పనిచేస్తాయి. అందులో పనిచేసే కార్మికులను అడ్డుగా పెట్టుకొని డ్రాగన్‌కు అనుకూల నిర్ణయాలు తీసుకొనేలా ప్రయత్నిస్తోంది' అని ఆయన ఆరోపించారు. త్వరలో గద్దెనక్కనున్న బైడెన్‌ ప్రభుత్వాన్ని ప్రభావం చేసేందుకు డ్రాగన్‌దేశం ఆసియాపై సైనికదాడికి దిగే అవకాశముందని హెచ్చరించారు.

'అమెరికాతో బహిరంగ ఘర్షణకు దిగాలని చైనా అనుకుంటోంది. ఇందుకు వాషింగ్టన్‌ సిద్ధంగా ఉండాలి. నాయకులు విడిపోకుండా ఐక్యతతో ముప్పును గ్రహించాలి. దాని గురించి మాట్లాడాలి. పరిష్కారానికి సిద్ధంగా ఉండాలి' అని ర్యాట్‌క్లిప్‌ రాశారు. ఈ వ్యాఖ్యలతో చైనా ప్రభుత్వ అధికార ప్రతినిధి హువా చునియింగ్‌ విభేదించారు.

ఇదీ చూడండి: భారత్​ కోసం అమెరికన్​ 'రోమియో' దేశీ అవతారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.