ETV Bharat / international

ట్వీట్​తో 'అణు కమాండ్​'ను హడలెత్తించిన పిల్లాడు! - అమెరికా న్యూస్

అమెరికా అణ్వాయుధాల విభాగం ట్విట్టర్​ ఖాతా నుంచి వచ్చిన ఓ ట్వీట్​ గందరగోళం సృష్టించింది. అయితే ఈ ఖాతా నిర్వహించే ఉద్యోగి పిల్లలు పొరపాటున ఆ ట్వీట్​ చేసినట్లు గుర్తించిన ​'యూఎస్ స్ట్రాటజిక్ కమాండ్​' వాటిని తొలగించింది.

child-unknowingly-tweets-from-us-nuclear-commands-account
అణు కమాండ్‌ నుంచి అవాంఛిత ట్వీట్‌..!
author img

By

Published : Apr 1, 2021, 10:01 AM IST

అమెరికాలో అణ్వాయుధాల బాధ్యతను 'యుఎస్‌ స్ట్రాటజిక్‌ కమాండ్‌' చూసుకొంటుంది. ఈ కమాండ్‌కు చెందిన సోషల్‌ మీడియా ఖాతా నుంచి వచ్చే ట్వీట్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కానీ, ఓ పసిబిడ్డ అందరిని హడలెత్తించాడు. ఈ కమాండ్‌ ట్విట్టర్‌ ఖాతా నుంచి వచ్చిన ట్వీట్‌ ఏమిటో అర్థం కాక చాలా మంది రకరకాలుగా ఊహించుకొన్నారు.

చిన్నారి పొరపాటు..

ఆ ట్విట్టర్‌ ఖాతాను నిర్వహించే మేనేజర్‌ వర్క్‌ఫ్రం హోం చేస్తున్నారు. ఇటీవల మేనేజర్‌ 'యుఎస్‌ స్ట్రాటజిక్‌ కమాండ్‌' ట్విట్టర్‌ ఖాతాను తెరిచి.. ఇతర పనుల్లో మునిగిపోయారు. అక్కడే ఉన్న మేనేజర్‌ పిల్లలో ఒకరు ఆ కీబోర్డుతో ఆడుకొన్నారు. దీంతో '';l;;gmlxzssaw,'' అని పొరబాటున ట్వీట్‌ అయ్యింది. ఈ ట్వీట్‌ చూసి ఏం జరుగుతోందో తెలియక చాలా మంది బుర్రగోక్కున్నారు. అదేదో అమెరికా న్యూక్లియర్‌ కోడ్‌ అని సరదాగా జోకులేసుకొన్నారు. కొద్ద సేపటి తర్వాత 'ఎటువంటి ప్రమాదకరఘటన జరగలేదు.. మా ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌ కాలేదు' అని ట్వీట్‌ చేశారు. కొద్ది సేపటి తర్వాత రెండు ట్వీట్లను డిలీట్‌ చేశారు.

ఇంతకుముందూ..

ఈ స్ట్రాట్‌ కమాండ్‌ నుంచి ఇటువంటి ట్వీట్‌ రావడం ఇది రెండో సారి. 2018లో డిసెంబర్‌లో కూడా ఓ గందరగోళమైన ట్వీట్‌ వచ్చింది. 'నూతన సంవత్సరం సందర్భంగా న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో భారీ బంతిని పడేయడం ఆచారం. ఒక వేళ ఎప్పుడైనా అవసరమైతే చాలా చాలా పెద్ద బంతిని కింద పడేయడానికి సిద్ధంగా ఉన్నాము' అని ట్వీట్‌ చేశారు. దీంతోపాటు బీ-2స్టెల్త్‌ బాంబర్‌ వీడియోను కూడా ట్వీట్‌ చేశారు. కొద్ది గంటల తర్వాత ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశారు.

ఇవీ చదవండి: అమెరికా ఆర్మీ పోస్ట్​పై దాడికి ఇరాన్​ కుట్ర!

'మార్స్​ మిషన్​' సమాచారాన్ని ఇస్రోతో పంచుకున్న నాసా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.