ETV Bharat / international

చైనా సరిహద్దు వ్యవహారంపై 2+2లో చర్చ! - భారత్​ అమెరికా 2+2 చర్చలు

త్వరలో జరగనున్న 2+2 చర్చల్లో చైనా సరిహద్దు వివాదం చర్చకు వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. చైనా దురాక్రమణను అడ్డుకోవాలంటే ఆగ్నేయాసియాలో భారత్​ శక్తిమంతంగా మారాల్సిన అవసరం ఉందని ఓ అమెరికా అధికారి అభిప్రాయపడ్డారు. హిమాలయాల నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు చైనా దురుసు వైఖరిని ప్రదర్శిస్తోందని ట్రంప్‌ పాలకవర్గంలోని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Border tensions with China to be discussed in India-America 2+2 dialogues
చైనా సరిహద్దు వ్యవహారంపై 2+2లో చర్చ!
author img

By

Published : Oct 24, 2020, 11:27 AM IST

భారత్‌-అమెరికా మధ్య జరగబోయే 2+2 చర్చల్లో చైనా సరిహద్దు అంశం సైతం చర్చకు వచ్చే అవకాశం ఉందని అగ్రరాజ్య ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భారత్‌-చైనా సరిహద్దుల్లో పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నామన్నారు. మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. చైనా దురాక్రమణపూరిత వైఖరిని నిలువరించాలంటే ఆగ్నేయాసియాలో భారత్‌ శక్తిమంతంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు దక్షిణ చైనా సముద్రంలో భారత్‌ తన సైనిక కార్యకలాపాల్ని వేగవంతం చేయడం.. ఆ ప్రాంతంలోని ఇతర మిత్రదేశాలతో కలిసి పనిచేయడం స్వాగతిస్తున్నామన్నారు.

హిమాలయాల నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు చైనా దురుసు వైఖరిని ప్రదర్శిస్తోందని ట్రంప్‌ పాలకవర్గంలోని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి భారత్‌ వంటి మిత్ర దేశాలతో కలిసి పనిచేస్తామన్నారు. ఈ మేరకు రక్షణ విక్రయాలు, విన్యాసాలు, కీలక సమాచార మార్పిడి వంటి అంశాల్లో భారత్‌కు సహకారం అందిస్తున్నామన్నారు. 2016 తర్వాత భారత్‌-అమెరికా మధ్య రక్షణ భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కిందన్నారు.

అధ్యక్ష ఎన్నికల తర్వాత కూడా చైనా విషయంలో భారత్‌కు సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం మారినా ఈ విషయంలో పెద్దగా మార్పు ఉండదని తేల్చి చెప్పారు. అమెరికాలోని రెండు ప్రధాన పార్టీలూ భారత్‌తో మెరుగైన సంబంధాల్నే కోరుకుంటున్నాయన్నారు.

భారత్‌-అమెరికాల మధ్య అత్యంత కీలకమైన 2+2 చర్చలు ఈ నెల 26-27 తేదీల్లో దిల్లీలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. అందులో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్‌లు- భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, విదేశీవ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌లతో భేటీ కానున్నారు. ప్రాంతీయ భద్రతా సహకారం, రక్షణ సమాచార మార్పిడి, సైనిక సంప్రదింపులు, రక్షణోత్పత్తుల వ్యాపారంపై ప్రధానంగా చర్చించనున్నారు. అత్యంత కీలకమైన బేసిక్‌ ఎక్స్చేంజీ అండ్‌ కో-ఆపరేషన్‌ అగ్రిమెంట్‌ (బెకా)పై సంతకాలు చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇదీ చూడండి:- సవాళ్లకు దీటుగా భారత్‌ వ్యూహాత్మక పొత్తులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.