జంతువులు కూడా కరోనా బారిన పడుతున్నట్టు వార్తలు వస్తున్న వేళ వాటికి టీకా ప్రక్రియ మొదలుపెట్టింది అమెరికా. ఈ మేరకు అగ్రరాజ్యంలోని ఒక్లాండ్లో ఉన్న జంతుప్రదర్శనశాలలో కొన్ని జంతువులకు టీకా వేశారు సిబ్బంది.
జోటీస్ అనే ఔషధ తయారీ సంస్థ ప్రత్యేకంగా జంతువుల కోసం రూపొందించిన ఈ టీకాను పులులు, ఎలుగుబంట్లు, సింహాలకు ఇచ్చినట్లు అక్కడి వైద్యాధికారులు తెలిపారు. జంతువుల రోగ నిరోధకశక్తి ఆధారంగా టీకాలు ఇస్తున్నట్లు వివరించారు. జోటీస్ సంస్థ ఇప్పటికే అమెరికాలోని 70 జంతుప్రదర్శనశాలలకు 11వేల టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: సముద్రంలో కూరగాయలనూ పండించేస్తున్నారు..!