ETV Bharat / international

'ఎన్నికల్లో జోక్యం చేసుకుంటే ఎవ్వరినీ వదిలిపెట్టను' - Biden warns china, russia, iran

నవంబర్​ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. కొన్ని దేశాలు ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని అగ్రరాజ్యం అరోపిస్తుంది. అయితే అలాంటి దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు డెమొక్రటిక్​ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​.

Biden warns any country that interferes in US elections 'will pay a price' if he is elected
ఎన్నికల్లో జ్యోక్యం చేసుకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదు
author img

By

Published : Oct 23, 2020, 11:29 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏ దేశం జోక్యం చేసుకున్నా.. తాను గెలిచాక తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు డెమొక్రటిక్​ పార్టీ అభ్యర్థి జో బైడెన్​. ట్రంప్​- బైడెన్​ మధ్య నాస్​విల్లేలోని బెల్మాంట్ విశ్వవిద్యాలయంలో జరిగిన చివరి సంవాదంలో అమెరికా ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని ఎలా అడ్డుకుంటారని అనుసంధానకర్త వేసిన ప్రశ్నకు బదులుగా బైడెన్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

" అమెరికా సార్వభౌమత్వం విషయంలో వారు జోక్యం చేసుకుంటున్నారు." అని రష్యా, ఇరాన్​, చైనాను ఉద్దేశించి అన్నారు బైడెన్​. ఎన్నికల్లో మితిమీరిన జోక్యం చేసుకోవడానికి ఇరాన్​ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ట్రంప్​ కూడా ఈ విషయం తనకు తెలుసు అని ధ్రువీకరించినట్లు బైడెన్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అమెరికా ఓటర్లకు ఇరాన్​ 'ఈమెయిల్​'​ బెదిరింపులు!

రష్యా హ్యాకర్ల దాడి..

అమెరికాలోని స్థానిక ప్రభుత్వాల నెట్​వర్క్​లపై రష్యా హ్యాకర్లు దాడి చేసినట్లు అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. రెండు సర్వర్ల నుంచి డేటాను సైతం అపహరించినట్లు అధికారులు వివరించారు. ఎన్నికలకు ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఇలా జరగడం ఓటింగ్​, ఫలితాలపై ప్రభావితం చూపే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బైడెన్​ పైవ్యాఖ్యలు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.