అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీకి ప్రజలు పట్టం కడితే.. అధికారం చేపట్టిన తొలిరోజే కరోనా నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపొంది, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు డెమొక్రటిక్ అభ్యర్థి బైడెన్. కరోనా కట్టడిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారని... ఫలితంగా 2 లక్షల 30 వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. 'మాస్క్‌ను ఎగతాళి చేయడానికి బదులు.. ధరించే అధ్యక్షుడు ఉంటే మనం ఎక్కడ ఉంటామో ఊహించుకోండి' అంటూ ట్రంప్‌పై విమర్శలు చేశారు బైడెన్.
ట్రంప్ ఇంటికి వెళ్లాల్సిన సమయం..
'అధ్యక్షుడు ట్రంప్.. తట్ట, బుట్ట సర్దుకుని ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. మా పార్టీకే ఓటు వేయాలి' అని ప్రజలను కోరారు డెమొక్రటిక్ అభ్యర్థి. ఈ నేపథ్యంలోనే 'మేము అధికారంలోకి వస్తే కరోనా కట్టడికి ప్రణాళిక రూపొందిస్తాం. ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తాం' అని ప్రజలకు హామీ ఇచ్చారు. 'ట్రంప్‌ను ఓడించడమే కరోనా వైరస్‌ను ఓడించేందుకు తొలి అడుగు' అని అన్నారు బైడెన్.
ట్రంప్ మొదటి మూడేళ్ల పరిపాలనలో కంటే ఒబామా అధ్యక్షుడిగా ఉన్న మొదటి మూడేళ్లలో ఎక్కువ ఉద్యోగాలు కల్పించారన్నారని పేర్కొన్నారు బైడెన్.
ఇదీ చూడండి: ఇన్‌స్టాలో కమల 'ఇడ్లీ- సాంబార్' ముచ్చట్లు