ETV Bharat / international

'గత 40 ఏళ్లలో లేని విధంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి'

author img

By

Published : May 11, 2021, 9:32 AM IST

ఆమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థ రానున్న నెలల్లో వేగంగా పుంజుకుంటుందని పేర్కొన్నారు. మరోవైపు ట్రాన్స్​జెండర్లు లింగ వివక్ష ఎదుర్కోకుండా బైడెన్​ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

joe biden on america economy, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
జో బైడెన్

గత 40 ఏళ్లలో లేని విధంగా రానున్న నెలల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్​ సోమవారం పేర్కొన్నారు. అయితే ఈ క్రమంలో స్వల్ప అడ్డంకులు ఎదురవతాయని తెలిపారు. గత రెండు నెలలుగా గణనీయంగా తగ్గిన ఉపాధి అవకాశాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

"అమెరికన్ల ఉద్యోగాలకు సంబంధించి ఓ ప్రణాళిక అవసరం. ఈ మేరకు ఎనిమిదేళ్ల సుదీర్ఘ ప్రణాళికను రచించాం. దీని ద్వారా దేశంలోని ఉద్యోగులందరూ.. వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ నుంచి లాభపడేలా చర్యలు చేపట్టనున్నాం."

-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

ఆరోగ్య రంగంలో ట్రాన్స్​జెండర్లు లింగ వివక్ష ఎదుర్కోకుండా బైడెన్​ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ట్రాన్స్​జెండర్ల హక్కులను పరిమితం చేస్తూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ తీసుకున్న నిర్ణయాన్ని బైడెన్​ రద్దు చేశారు. బైడెన్​ నిర్ణయం పట్ల అమెరికన్​ మెడికల్​ అసోసియేషన్​ హర్షం వ్యక్తం చేసింది. అయితే పలువురు ఈ చర్యపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి : 'భారత్​ రకం కరోనా స్ట్రెయిన్​.. ఆందోళనకరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.