ETV Bharat / international

ఇరాన్​పై ఆంక్షలు తొలగించే ప్రసక్తే లేదు: బైడెన్​ - ఇరాన్​ అమెరికా

అణు ఒప్పందం నేపథ్యంలో ఇరాన్​పై ఉన్న ఆంక్షలను తొలగించమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ స్పష్టం చేశారు. ఈ మేరకు తమపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తేనే.. చర్చలు జరుపుతామన్న ఇరాన్​ మాటలను కొట్టిపారేశారు.

Biden refuses to lift sanctions to get Iran back to negotiating table over nuclear deal
ఇరాన్​పై ఆంక్షలు తొలగించే ప్రసక్తే లేదు: బైడెన్​
author img

By

Published : Feb 8, 2021, 5:33 AM IST

2015 అణు ఒప్పందంపై తిరిగి చర్చలు జరపాలంటే తమపై ఉన్న ఆంక్షలను తొలగించాలన్న ఇరాన్​ డిమాండ్​ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ కొట్టిపారేశారు. ఇరాన్​పై ఉన్న ఆంక్షలను తొలగించబోమని స్పష్టం చేశారు. అణు ఒప్పందంలో భాగంగా యురేనియం నిల్వలను ఇరాన్​ తగ్గిస్తేనే.. ఆ దేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తామని తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని అగ్రరాజ్యంలోని ఓ ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది.

'అణు ఒప్పందంలో చర్చల్లో భాగంగా.. ఇరాన్​ను తిరిగి తెరపైకి తీసుకొచ్చేందుకు.. ఆ దేశంపై ఉన్న ఆంక్షలను తొలగిస్తారా?' అన్న ప్రశ్నకు బైడెన్​.. 'లేదు' అని జవాబుచెప్పినట్టు వార్తా సంస్థ పేర్కొంది.

'మీరే తగ్గాలి...'

ఇదే విషయంపై ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ ఆదివారం స్పందించారు. చర్చలు జరపాలంటే ఇరాన్​పై ఉన్న ఆంక్షలను అమెరికా తొలగించాల్సిందేనని పునరుద్ఘాటించారు.

"జేసీపీఓఏ(జాయింట్​ కామ్ప్రహెన్సివ్​ ప్లాన్​ ఆఫ్​ యాక్షన్​)లోకి ఇరాన్​ తిరిగి చేరాలంటే.. దేశంపై ఉన్న ఆంక్షలను అమెరికా తొలగించాల్సిందే. అది జరిగిన వెంటనే జేసీపీఓఏకు కట్టుబడి ఉంటాం."

--- అయతొల్లా ఖమేనీ, ఇరాన్​ సుప్రీం నేత.

ఇదీ చూడండి:- అమెరికా జైలులో ఖైదీల విధ్వంస కాండ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.