ETV Bharat / international

హెచ్​-1బీపై ముగిసిన నిషేధం- మనోళ్లకు లాభం! - హెచ్​-1బీ వీసాపై ముగిసిన కాలపరిమితి

హెచ్-1బీ వీసాలపై ట్రంప్​ విధించిన నిషేధం మార్చి 31తో ముగిసింది. ఆంక్షల్ని కొనసాగించరాదని జో బైడెన్ ప్రభుత్వం నిర్ణయించగా... వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు లాభం కలగనుంది.

Biden lets Trump era H-1B visa bans expire; Indian IT professionals to benefit
హెచ్​-1బీ వీసాలపై నిషేధాన్ని పునరుద్ధరించని బైడెన్​
author img

By

Published : Apr 1, 2021, 11:47 AM IST

అమెరికాలో విదేశీ నిపుణులు పనిచేసేందుకు వీలు కల్పించే హెచ్​-1బీ వీసాలపై గత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ విధించిన నిషేధం ముగిసింది. ట్రంప్​ అమల్లోకి తెచ్చిన నిషేధాజ్ఞల్ని మరింతకాలం కొనసాగించరాదని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్​ నిర్ణయించగా... వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు లబ్ధి చేకూరనుంది.

దేశవ్యాప్త లాక్​డౌన్​, కరోనా సంక్షోభం నేపథ్యంలో.. అమెరికన్లకు నష్టం జరుగుతుందని.. హెచ్-1బీ విసాలతో పాటు ఇతర తాత్కాలిక, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలపై గతేడాది జూన్​లో నిషేధం విధించారు అప్పటి అధ్యక్షుడు ట్రంప్. ఈ ఉత్తర్వులను.. తొలుత 2020 డిసెంబర్​ 31వరకు, ఆ తర్వాత 2021 మార్చి 31 వరకు పొడిగించారు. కరోనా మహమ్మారి అగ్రరాజ్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. పొడిగింపు అవసరమని నాడు ట్రంప్​ ప్రభుత్వం పేర్కొంది. అయితే.. బైడెన్​ సర్కార్​ తాజాగా వీటి పొడిగింపుపై ఎలాంటి ప్రకటనా చేయకపోవడం వల్ల.. ఆ గడువు ముగిసిపోయంది.

ట్రంప్​ ఇమ్మిగ్రేషన్​ విధానాలు కఠినమైనవిగా భావించిన బైడెన్​.. హెచ్​-1బీ వీసాలపై నిషేధం ఎత్తివేస్తామని ఇదివరకే హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: హెచ్​1బీ వీసాదారులకు మరింత ఊరట!

ఏంటీ హెచ్​-1బీ వీసా?

'హెచ్‌-1బీ' అనేది వలసేతర వీసా. నిపుణులైన విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకునేందుకు ఈ వీసా విధానం అమెరికా కంపెనీలకు వీలు కల్పిస్తుంది. దాని ద్వారా భారత్‌, చైనా తదితర దేశాల నుంచి ఏటా వేల సంఖ్యలో ఐటీ నిపుణులు అగ్రరాజ్యానికి వెళ్లగలుగుతున్నారు. ట్రంప్​ ప్రకటన గడువు ముగియడం వల్ల.. అమెరికన్​ దౌత్య విభాగం ఇకపై హెచ్​-1బీ వీసాలు జారీ చేస్తాయి. ఫలితంగా.. యూఎస్​ కంపెనీలు ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల్ని దేశంలోకి ఆహ్వానిస్తాయి.

ఇదీ చదవండి: 'మార్స్​ మిషన్​' సమాచారాన్ని ఇస్రోతో పంచుకున్న నాసా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.