ETV Bharat / international

తాలిబన్​ ఒప్పందంపై అమెరికా యూటర్న్​! - taliban

అఫ్గానిస్థాన్​ నుంచి సైన్యం ఉపసంహరణపై అగ్రరాజ్యం కీలక ప్రకటన చేసింది. తాలిబన్ల కార్యకలాపాలను గమనించాకే ఈ చర్యపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.

taliban, america, us taliban deal
తాలిబన్​ ఒప్పందంపై అమెరికా యూటర్న్​!
author img

By

Published : Jan 23, 2021, 12:08 PM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ హయాంలో జరిగిన తాలిబన్ ఒప్పందంపై బైడెన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఒప్పందాన్ని సమీక్షించనున్నట్టు వెల్లడించింది. అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల కార్యకలాపాలను పరిశీలించి ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు ఇరు దేశాల జాతీయ భద్రత సలహాదారులు చర్చలు జరిపారు. ఈ విషయంపై అమెరికా జాతీయ భద్రత మండలి ప్రతినిధి ఎమిలీ హోర్న్​ వివరణ ఇచ్చారు. అఫ్గాన్​ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చలు ఫలించేలా అమెరికా కృషి చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు.

గతేడాది ఫిబ్రవరిలో అమెరికా తాలిబన్ల మధ్య ఒప్పందం జరిగింది. అఫ్గాన్​లో తాలిబన్లు హింసకు పాల్పడకుండా ఉంటే తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటామని అగ్రరాజ్యం పేర్కొంది. ఈ ప్రకారం ఇప్పటికే అమెరికా చర్యలు చేపడుతోంది. తాజాగా వెల్లడైన ప్రకటనతో.. ఉపసంహరణ తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉంది. అమెరికాతో ఒప్పందం జరిగి ఏడాది అయినా తాలిబన్ల దాడులు కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి : భారత్​ ఓ నిజమైన మిత్ర దేశం: అమెరికా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.