ETV Bharat / international

'దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని సహించేదే లేదు' - దక్షిణాసియా

తాము అధికారంలోకి వస్తే దక్షిణాసియాకు అధిక ప్రాధాన్యం ఇస్తామని బిడెన్​ వర్గం తమ ఎన్నికల ప్రచారాల ద్వారా స్పష్టం చేసింది. ముఖ్యంగా దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని సహించబోమని.. ఉగ్రవాదులను ఏరివేస్తామని తేల్చిచెప్పింది. అదే సమయంలో సహజ భాగస్వాములైన భారత్​తో బంధాన్ని మరింత దృఢపరుచుకుంటామని స్పష్టం చేసింది.

biden-admin-will-have-no-tolerance-for-terrorism-in-s-asia-says-his-campaign
'దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని సహించేదే లేదు'
author img

By

Published : Sep 18, 2020, 11:02 AM IST

Updated : Sep 18, 2020, 11:46 AM IST

అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమెరికా రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా భారత్​ సహా దక్షిణాసియా దేశాల మద్దతును పొందేందుకు రిపబ్లికన్లు- డెమొక్రాట్లు తమ ఎన్నికల ప్రచారాల్లో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా.. తాము అధికారంలోకి వస్తే దక్షిణాసియాకు అధిక ప్రాధాన్యం ఇస్తామని డెమొక్రటిక్​ పార్టీ అభ్యర్థి జో బైడెన్​ యంత్రాంగం ఉద్ఘాటించింది. ముఖ్యంగా దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని సహించబోమని తేల్చిచెప్పింది.

భారత్​తో తమ బంధాన్ని మరింత దృఢ పరుచుకునేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేసింది బిడెన్​ వర్గం. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరివైపు నిలబడాలనే అంశాన్ని నిర్ణయించేందుకు హిందూ అమెరికన్​ పొలిటికల్​ యాక్షన్​ కమిటీ వేసిన పలు ప్రశ్నలకు ఈ విధంగా సమాధానమిచ్చింది.

"భారత్​- అమెరికాల బంధం సహజమైనదని మేము విశ్వసిస్తున్నాం. ఒబామా పాలనలో ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్​-అమెరికాలు కలిసి పనిచేశాయి. ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే.. ఈ విధానాన్నే కొనసాగించేందుకు బైడెన్​ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది."

--- బైడెన్​ యంత్రాంగం

అదే సమయంలో దక్షిణాసియాతో సహా ఇతర దేశాల్లోని మైనారిటీలు, శరణార్థుల సమస్యలపై బైడెన్​ ఆవేదన వ్యక్తం చేశారు. వారందరికీ ఓ ఆశాకిరణంగా ఉండే విధంగా అమెరికాను తీర్చిదిద్దుతామని తెలిపారు.

ఇదీ చూడండి:- 'ట్రంప్​ మాటల కన్నా.. వారినే నేను నమ్ముతా'​

Last Updated : Sep 18, 2020, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.