అమెజాన్ అడవులను రక్షించుకుంటామంటూ బ్రెజిల్‌లోని జింగ్ ప్రాంత ఆదివాసీలు ముందుకు వచ్చారు. ప్రపంచ ప్రజలు తమకు అండగా నిలవాలని వారు కోరుతున్నారు. అడవుల నరికివేత, అక్రమ మైనింగ్ చేయకూడదని డిమాండ్ చేస్తున్నారు. స్వచ్ఛమైన నదీ జలాల్లో పురుగు మందులు కలవకుండా చూడాలని అభ్యర్థిస్తున్నారు.
"భవిష్యత్‌లో ఏం జరుగుతుందోననే భయంతో ప్రపంచమంతా అమెజాన్ గురించి ప్రార్థనలు చేస్తోంది. ఈ విపత్కర సమయంలో జింగ్, నదీతీర ప్రజలందరం ఓ చోట చేరాం. మేమంతా కలిసి అమెజాన్ అరణ్యాలను కాపాడాలని నిశ్చయించుకున్నాం. జీవనం కోసం, ఉత్పత్తుల కోసం మేము అరణ్యాలను నాశనం చేయడంలేదు. మా బిడ్డలు, మనవళ్ల కోసం, భూమాత భవిష్యత్ కోసం వాటిని మేము రక్షించుకుంటున్నాం."
- ఓ ఇ కయాపో, జింగ్ ప్రాంత ప్రతినిధి
బ్రెజిల్ కార్చిచ్చు
అమెజాన్ అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు అంతకంతకూ వ్యాపిస్తూనే ఉంది. మూగజీవాలు... ఆవాసాన్ని, ప్రాణాలను కోల్పోతున్నాయి. దావానలాన్ని అదుపుచేయాలని, పర్యావరణాన్ని సంరక్షించాలని బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారోపై అంతర్జాతీయంగా, దేశీయంగా ఒత్తిళ్లు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మంటలను అదుపుచేయడానికి సైన్యాన్ని రంగంలోకి దింపారు.
సమస్య తీవ్రత దృష్ట్యా కార్చిచ్చు నివారణ చర్యల గురించి జీ-7 శిఖరాగ్ర సదస్సులో అగ్రదేశాలు చర్చించనున్నాయి.
ఇదీ చూడండి: జీ-7: మోదీ-ట్రంప్ భేటీలో ప్రధాన అంశాలు ఇవేనా?