అమెరికాలోని షికాగో ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో పది మంది ఇండియన్-అమెరికన్లు పోటీ చేస్తున్నారు. ఇందులో ఒకరు తెలుగు మూలాలు ఉన్న వైద్యుడు కావడం విశేషం. అభ్యర్థుల్లో ఐదుగురు మహిళలు ఉండడం ఇంకో విశేషం. ఈ నెల ఆరో తేదీన ఎన్నికలు జరగనుండగా.. పోస్టల్ బ్యాలెట్ అప్పుడే ప్రారంభమయింది. ఓక్ బ్రూక్ నగర ట్రస్టీ స్థానం కోసం డాక్టర్ సురేష్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఆయన గతంలో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్(ఏఏపీఐ) అధ్యక్షునిగా కూడా పనిచేశారు.
ఎవరెవరు? ఎక్కడెక్కడ?
- మైనే టౌన్షిప్ హైవే కమిషనర్ పదవికి జితేంద్ర దిగ్నావ్కర్, షాంబర్గ్ టౌన్షిప్ ట్రస్టీ పదవికి నిమిషీ జాని, హోనోవర్ పార్క్ ట్రస్టీ పదవికి సయ్యద్ హుస్సైనీ, మైన్ టౌన్షిప్ క్లర్క్ పదవికి స్మితేష్ షా పోటీ పడుతున్నారు.
- మహిళల్లో వాసవీ చక్కా(నాపెర్విల్లీ సిటీ కౌన్సిల్), మేఘనా బన్సల్(వీట్ల్యాండ్ టౌన్షిప్-ట్రస్టీ), స్వేతా బెయిర్ అరోడా(ఆల్డర్మ్యాన్ 10వ వార్డు), సుప్నా జైన్, సాబా హైదర్(డిస్ట్రిక్ట్ 204 స్కూలు బోర్డు)లు బరిలో ఉన్నారు.
ఇదీ చూడండి:ఆ పోలీసు గౌరవార్థం అమెరికా జెండా అవనతం