వ్యాక్సిన్ ట్రయల్స్‌లో వలంటీర్ అస్వస్థతపై ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వివరణ ఇచ్చింది. ఆ వ్యక్తికి వచ్చిన అనారోగ్య సమస్యలు ఆస్ట్రాజెనికా ప్రయోగించిన కరోనా టీకా వల్ల అయ్యుండకపోవచ్చని తెలిపింది.
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనికా రూపొందించిన కొవిడ్-19 వ్యాక్సిన్ సమర్థమైనదిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, బ్రిటన్‌లో టీకా ప్రయోగించిన ఓ వ్యక్తి అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ట్రయల్స్ నిలిపేశారు. ఇలాంటి ప్రక్రియ సహజమేనని.. వ్యాక్సిన్ తయారీ ఆలస్యం కాకుండా కారణం తెలుసుకుని పరిష్కరిస్తామని తెలిపింది.
అయితే నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభించిన తర్వాత యూకేలో ట్రయల్స్ పునఃప్రారంభించినట్లు సెప్టెంబర్ 12న ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. టీకా ప్రయోగాలు సురక్షితంగానే జరుగుతున్నట్లు నియంత్రణ సంస్థ నిర్ధరించిందని పేర్కొంది.
ఇదీ చూడండి: ఆక్స్ఫర్డ్ టీకా ట్రయల్స్ పునఃప్రారంభానికి లైన్ క్లియర్