మెక్సికోలోని ఉరౌపన్లో నలుగురు దుండగులు కలకలం సృష్టించారు. ఓ వీడియో కేంద్రం వద్ద కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 9మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు(12,13,14ఏళ్లు) ఉన్నారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
కొందరిని వెతుకుతూ వీడియో కేంద్రం వద్దకు వచ్చిన ఆగంతకులు.. వినియోగదారులపై విచక్షణారహితంగా దాడి చేశారు.
మెక్సికోలో డ్రగ్ డీలర్ అసోసియేషన్లోని కొన్ని వర్గాల మధ్య ఎన్నో ఏళ్లుగా ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఆధిపత్య పోరులో అనేక మారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.