అమెరికా నెబ్రస్కా రాష్ట్రంలోని లింకన్ చిల్డ్రన్ జూలో కరోనాతో మూడు మంచు చిరుతలు (snow leopard corona) మృతి చెందాయి. ఈ మేరకు జూ నిర్వాహకులు అధికారిక ఫేస్బుక్ పేజీలో వెల్లడించారు.
గత నెలలో రెండు సింహాలకు, మూడు మంచు చిరుతలకు (snow leoprd died of corona) కరోనా సోకింది. చికిత్సలో సింహాలు కోలుకున్నాయి. కానీ చిరుతలు వైరస్ ప్రభావం నుంచి బయటపడలేకపోయాయని 'జూ' యాజమాన్యం తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మనుషుల నుంచి జంతువులకు వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ.. పర్యటకులను అనుమతించినట్లు వెల్లడించింది.
అమెరికాలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. ఈ క్రమంలో పలు 'జూ'లు కూడా వైరస్ బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఇదీ చదవండి:బూస్టర్ డోసుపై డబ్ల్యూహెచ్ఓ అసంతృప్తి