ETV Bharat / international

హెచ్‌-1బీపై ఆంక్షలతో అమెరికాకే ఆర్థిక ముప్పు..!

author img

By

Published : Oct 20, 2020, 11:04 AM IST

హెచ్‌-1బీ వీసాల జారీపై అదనపు ఆంక్షలు విధిస్తూ 'డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌)' ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనిని సవాల్​ చేస్తూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి ఆ దేశంలోని సంస్థలు. ఈ నిర్ణయంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని అభిప్రాయం వ్యక్తం చేశాయి.

17 individual, organisations file H1B lawsuit against Department of Labor
హెచ్‌-1బీపై ఆంక్షలతో అమెరికాకే ఆర్థిక ముప్పు..!

హెచ్‌-1బీ వీసా విధానాన్ని మరింత కఠినతరం చేస్తూ ఇటీవల అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అక్కడి పలు వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. కొత్త విధానం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర హాని కలుగుతుందని హెచ్చరించాయి.

హెచ్‌-1బీ వీసాల జారీపై అదనపు ఆంక్షలు విధిస్తూ 'డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌)' ఇటీవల ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ వీసాల పరిధిలోకి వచ్చే ప్రత్యేక నైపుణ్యాలను కుదించింది. ఈ మేరకు ప్రత్యేక నైపుణ్యాల నిర్వచనంలో మార్పులు చేసింది. పాత వీసా విధానంలోని లొసుగులను తాజా మార్పులు సరిదిద్దుతాయని డీహెచ్‌ఎస్‌ అభిప్రాయపడింది. వీసా విధానంలో చేసిన తాజా మార్పులు 60 రోజుల్లో అమల్లోకి వస్తాయని తెలిపింది.

ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ తాజాగా 17 మంది ప్రముఖులు, సంస్థలు కొలంబియా డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌లో వ్యాజ్యం దాఖలు చేశారు. వీటిలో పలు విశ్వవిద్యాయాలు, వాణిజ్య సంస్థలు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ట్రంప్‌ తాజా నిర్ణయం నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆరోపించారు. హెచ్‌-1బీ వీసాదారుల వల్ల స్థానికులు ఉపాధి కోల్పోవడం లేదని.. పైగా వారి వల్లే ఉద్యోగ సృష్టి జరుగుతోందని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయని గుర్తుచేశారు. కొత్త నిబంధనల వల్ల విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఆసుపత్రులు, అంకుర సంస్థలు, చిరు వ్యాపారాలు సహా అమెరికా ఆర్థిక వ్యవస్థలోని ప్రతి అంశంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు. కొవిడ్‌-19 సంక్షోభంలో మార్కెట్‌ను, అమెరికా ఉపాధి మార్గాల్ని సరిగా అవగాహన చేసుకోకపోవడం వల్లే ఇలాంటి తప్పుడు నిర్ణయాలు వెలువడుతున్నాయని అభిప్రాయపడ్డారు.

'హెచ్‌-1బీ' అనేది వలసేతర వీసా. నిపుణులైన విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకునేందుకు ఈ వీసా విధానం అమెరికా కంపెనీలకు వీలు కల్పిస్తుంది. దాని ద్వారా భారత్‌, చైనా తదితర దేశాల నుంచి ఏటా వేల సంఖ్యలో ఐటీ నిపుణులు అమెరికా వెళ్లగలుగుతున్నారు.అయితే- 'హెచ్‌-1బీ' నిబంధనలను పలు కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని.. అమెరికా పౌరుల ఉద్యోగాలను విదేశీయులకు కట్టబెడుతున్నాయని చాన్నాళ్లుగా ట్రంప్‌ ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో సదరు వీసాల జారీపై అదనపు ఆంక్షలు విధిస్తూ 'డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌)' ఇటీవల నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

ఇదీ చూడండి: ఫౌచీ మాటలు విని ప్రజలు విసిగిపోయారు: ట్రంప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.