సూడాన్‌లో సైనిక పాలనను తొలగించి... ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని దేశవ్యాప్తంగా ప్రజలు చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని ఖర్తౌమ్లోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ ఎదుట నిరసనలు చేస్తోన్న వారిపై సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో చాలామంది ప్రాణాలొదిలారు. వందల మంది గాయపడ్డారు.
గడిచిన వారం రోజుల్లో ఖర్తౌమ్తో పాటు దేశవ్యాప్తంగా జరిగిన కాల్పుల ఘటనల్లో సుమారు 60 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రజాస్వామ్య స్థాపన నిరసనల నిర్వాహకులు పేర్కొన్నారు. అంతకు ముందు 40 మంది చనిపోయినట్లు ప్రకటించినప్పటికీ.. ప్రస్తుతం ఆ సంఖ్య మరింత పెరిగినట్లు తెలిపారు.
ఖర్తౌమ్, ఓమ్దుర్మాన్ నగరాల్లో బుధవారం సుమారు 10 మందిని భద్రతా దళాలు కాల్చివేశాయని సూడాన్ వైద్యుల కమిటీ తెలిపింది. అంతకు ముందు రోజు కూడా 10 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. వైట్ నైల్ స్టేట్‌లో ఐదుగురు, ఓమ్‌దుర్మాన్‌లో ముగ్గురు, బహ్రీలో ఇద్దరు చనిపోయినట్లు కమిటీ తెలిపింది.
ఇదీ చూడండి: మహిళను కాల్చి చంపిన ఉగ్రవాదులు