ఆఫ్రికా దేశం మాలీలో జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు సైనికులు మరణించారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు.
సెంట్రల్ మాలీలోని మోండోరోలో రెండు ఆర్మీ పోస్టులపై ఈ దాడి జరిగిందని అక్కడి సైన్యం తెలిపింది. ఈ దాడిని సైన్యం సమర్థంగా తిప్పికొట్టిందని స్పష్టం చేసింది. దాదాపు 30 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పేర్కొంది. 40 ద్విచక్రవాహనాలు, పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
ఈ దాడికి ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకోలేదు.