ఆఫ్రికా దేశం నైజర్‌లో జరిగిన ఇస్లామిక్ తీవ్రవాదుల దాడిలో సుమారు వంద మంది మరణించారు. మాలీ సరిహద్దుకు సమీపంలో ఉన్న రెండు గ్రామాలపై శనివారం ఈ దాడి జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులను స్థానికులు మట్టుబెట్టిన తర్వాత ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. ఈ గ్రామాలను నైజర్ ప్రధాని బ్రిగి రఫానీ సందర్శించారు. మృతులకు నివాళులు అర్పించారు.
ఇటీవల బోకోహారం, అల్‌ఖైదా వంటి ఉగ్రసంస్థల కార్యకలాపాలు నైజర్‌లో పెచ్చుమీరుతున్నాయి. ఆ దేశంలో వరుస దాడులకు పాల్పడుతున్నాయి. వేలాది మంది ఈ ఘటనల్లో మృత్యువాత పడుతున్నారు. లక్షల మంది ఆచూకీ కోల్పోతున్నారు. అంతర్జాతీయ సైన్యం ఈ దేశంలో పహారా కాస్తున్నప్పటికీ ఈ ఘటనలకు అడ్డుకట్ట పడటం లేదు.
ఈ పరిణామాల మధ్య నైజర్‌లో రెండో విడత అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఫ్రాన్స్ నుంచి 1960లో స్వాతంత్ర్యం పొందిన తర్వాత తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా అధికార బదిలీ జరుగుతోంది. 74 లక్షల మంది ప్రజలు ఎన్నికల్లో ఓటేయనున్నారు.
ఇదీ చదవండి: పాములతో బాడీ మసాజ్.. ఆరోగ్యానికి ఎంతో మేలట!