దక్షిణ మాలీ అగ్యూల్హోక్లోని ఐరాస క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో చాద్ దేశానికి చెందిన నలుగురు ఐరాస శాంతి పరిరక్షకులు మృతి చెందారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారని ఐక్యరాజ్య సమితి అధికారులు శుక్రవారం తెలిపారు. క్యాంప్‌లో గాయపడిన వారిని తీసుకురావడానికి హెలికాప్టర్లను పంపినట్లు వెల్లడించారు.
ఈ ఘటనను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఖండించారు. దాడిని తిప్పికొట్టిన భద్రతా దళాల ధైర్యాన్ని ప్రశంసించారు. శాంతి పరిరక్షకులను లక్ష్యంగా చేసుకుని జరుపుతున్న దాడులు యుద్ధ నేరాల కిందకి వస్తాయని స్పష్టం చేశారు. దుండగులను గుర్తించడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దని మాలీ ప్రభుత్వానికి సూచించారు.
2102 నుంచి ఇస్లామిక్ తీవ్రవాదుల దాడులతో మాలీ దేశం సతమతమవుతోంది.
ఇదీ చదవండి: అఫ్గాన్‌లో దాడులు- ఒక్క నెలలో 305మంది మృతి