కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, బీజేపీ అజెండాను ప్రజల దృష్టికి తీసుకువచ్చి ఓట్లు అడుగుతానని నల్లకుంట భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అమృత అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. డివిజన్లో చాలా సమస్యలు నెలకొని ఉన్నాయని.. గత పది సంవత్సరాలుగా కార్పొరేటర్ నిర్లక్ష్యంతో డివిజన్ అభివృద్ధికి నోచుకోలేదని.. డ్రైనేజీ వ్యవస్థ, తాగు నీటి వ్యవస్థ, రోడ్లు, వీధిలైట్లు.. చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఏ విధమైన పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు కావడం లేదని.. వీటన్నింటిపై దృష్టి సారిస్తానని తెలిపారు. ప్రధానంగా రత్న నగర్లో నాలాకు రిటైనింగ్ వాల్ నిర్మించి శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్వచ్ఛ హైదరాబాద్ కు కృషి చేస్తామని తెలిపారు.
కేంద్ర పథకాలు ప్రజలకు వివరిస్తా: భాజపా అభ్యర్థి అమృత - తెలంగాణ రాజకీయాలు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, బీజేపీ అజెండాను ప్రజల దృష్టికి తీసుకువచ్చి గెలిపించాలని కోరుతామని నల్లకుంట భాజపా అభ్యర్థి అమృత అన్నారు. తనను గెలిపిస్తే ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు.