కవాడిగూడ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవిత మహేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత కార్పొరేటర్, ప్రస్తుత తెరాస పార్టీ అభ్యర్థి పట్ల ప్రజల్లో ఏమాత్రం మంచి అభిప్రాయం లేదని.. తన గెలుపు ఖాయమనేందుకు అదే నిదర్శనమని కవిత మహేష్ ధీమా వ్యక్తం చేశారు. డివిజన్లోని బస్తీలలో ఇంటింటికీ పాదయాత్ర చేస్తూ చేతి గుర్తుకు ఓటు వేయాలని ఆమె అభ్యర్థించారు. గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో ప్రజలు అనేక సమస్యలు తెలిపారని, కవాడిగూడ అంటేనే అనేక సమస్యలకు నిలయంగా మారిందని, గత కార్పొరేటర్ ఏ మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. వరద సహాయం అందించడంలో సర్కారు విఫలమైందన్నారు. కరోనా విపత్కర సమయంలో ఏ ఒక్కరు బస్తీ పేదలను పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు మండిపడుతున్నట్లు ఆమె వివరించారు. ఈ ఎన్నికల్లో తనకు ఒకసారి అవకాశమివ్వాలని ఆమె అభ్యర్థించారు.
ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: కాంగ్రెస్ అభ్యర్థి కవిత - తెలంగాణ రాజకీయాలు
కవాడిగూడలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కవిత మహేష్ ధీమా వ్యక్తం చేశారు. తెరాస కార్పొరేటర్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే తమ గెలుపునకు బాటలు వేస్తుందన్నారు. తనను గెలిపిస్తే బస్తీవాసుల సమస్యలు తీర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.