జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో తెరాస అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. గతంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు. జీడిమెట్ల డివిజన్ తెరాస అభ్యర్థి పద్మ విమానపురికాలనీ, జయరాంనగర్లో ఎన్నికల ప్రచారం చేశారు.
గత ఐదేళ్లలో సుమారు 100 కోట్ల అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. తనకు మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: 'ఎన్టీఆర్, పీవీ ఘాట్లకు వెళ్లి ఆ మహనీయులకు నివాళులర్పిస్తా'