Yash 19 Title Reveal : కన్నడ స్టార్ హీరో, కేజీయెఫ్ ఫేమ్ నటుడు యశ్ త్వరలో మరో సూపర్ మూవీతో ఆడియెన్స్‌ను అలరించనున్నారు. యాశ్ 19గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. 'టాక్సిక్' (Toxic) అనే పేరుతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం ఓ స్పెషల్ వీడియో ద్వారా అనౌన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటూ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
'ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' అన్న ట్యాగ్ లైన్‌తో విడుదలైన ఈ వీడియో యశ్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. దీంతో సోషల్ మీడియాలో # Yash 19 అంటూ ఈ వీడియోతో పాటు ఫొటోలను నెట్టింట తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇందులో యశ్ ఓ చేతిలో పెద్ద గన్ పట్టుకుని మరో చేత్తో సిగరెట్ తాగుతూ కనిపించారు. కానీ ఆయన లుక్‌పై అంత క్లారిటీ రావట్లేదు.
మరోవైపు, ఈ చిత్రాన్ని కేవీన్‌ఎన్ ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా గ్రాండ్ స్కేల్లో విడుదల కానుంది. అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈమె తెరకెక్కించిన 'లయర్ డైస్' అనే మూవీ ఆస్కార్ నామినేషన్స్‌లో నిలిచింది. కానీ తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. ఇక యాక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టిన గీతూ మోహన్ దాస్ ఆ తర్వాత మెగాఫోన్ పట్టింది. ఇక ఈ సినిమాలో నటించనున్న ఇతర స్టార్స్ గురించి మేకర్స్ రివీల్ చేయలేదు. అయితే ఈ మూవీలో యశ్‌కు జోడీగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి నటించనున్నట్లు టాక్ నడుస్తోంది.
ఇక యశ్ తన 19 మూవీ అనౌన్స్‌మెంట్‌తో అభిమానులకు ఊరట కలిగించారు. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో కథల్ని విని ఆయన పక్కకు పడేశారట. 'కెజీయెఫ్' తర్వాత దాదాపు ఏడాది పాటు పలు డైరెక్టర్లు చెప్పిన కథలను వింటూనే ఉన్నారట. దీంతో ఈ మూవీ అనౌన్స్ మెంట్ కాస్త లేట్ అయ్యింది. అయినప్పటికీ ఫ్యాన్స్ యశ్ కొత్త సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. అయితే ఈ వీడియోతో ఎట్టకేలకు ఆ నిరీక్షణకు తెరపడినట్లే అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుందని సమాచారం.
KGF 3 Update : 'కేజీఎఫ్-3' సెట్స్‌పైకి వెళ్లేది ఆ రోజే.. రిలీజ్ డేట్ కూడా..
సాయిపల్లవికి క్రేజీ ఆఫర్- యశ్ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్!