Vijay Devarakonda Rashmika Engagement : గత కొంత కాలంగా టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గురించి తెగ చర్చలు జరగుతున్నాయి. ఈ ఇద్దరూ అప్పుడప్పుడు కలియతిరగడం చూసి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పలు రూమర్స్ కూడా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఇద్దరూ తమ ఫ్యాన్స్‌కు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట. తమ పెళ్లి గురించి అనౌన్స్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఇందులో భాగంగా వచ్చే నెల మొదటి వారంలో ఈ ఇద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోను న్నట్లు ఇటీవలే తెగ వార్తలు నెట్టింట హల్ చల్ చేశాయి. అయితే వీటిపై విజయ్ దేవరకొండ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇందులో వాస్తవాలు లేవంటూ కొట్టిపారేసింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఏమాత్రం నమ్మొద్దంటూ కోరింది.
'గీతా గోవిందం' సినిమాతో ఆన్‌స్క్రీన్‌పై మంచి జోడీ అనిపించుకున్నారు రష్మిక విజయ్ జంట. ఈ మూవీలో వాళ్ల యాక్టింగ్‌తో పాటు కెమిస్ట్రీ సూపర్ అంటూ ఫ్యాన్స్ అప్పట్లో ఈ జోడీకి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి 'డియర్ కామ్రేడ్' సినిమాతో ప్రేక్షకులను మరోసారి పలకరించారు. ఇందులోనూ ఈ జంట యాక్టింగ్‌కు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో ఫ్యాన్స్ ఈ జంట చూడముచ్చటగా ఉందంటూ నెట్టింట వీరిని ట్రెండ్ చేయడం మొదలెట్టారు. అయితే వీరిద్దరి మధ్య లవ్ ఉన్నట్లు అప్పట్లో రూమర్స్ వచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవాలేనని తాము మంచి స్నేహితులం అంటూ గతంలో వీరిద్దరూ సమాధానమిచ్చారు. పలు ఇంటర్వ్యూల్లోనూ క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ వీరిద్దరూ అప్పుడప్పుడు బయట కలిసి కనిపించిన సందర్భాలున్నాయి. దీంతో ఆ రూమర్స్ నిజమే అంటూ కొంత మంది నెటిజన్లు వీరి ఇన్‌స్టా పోస్ట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కామెంట్లు పెడుతుంటారు. మరికొందరేమో ఆ పోస్ట్‌లను నిశితంగా గమనిస్తుంటారు. అలా ఈ జంట పలు మార్లు ఒకే చోట ఉన్నట్లు కనిపించారు. కానీ ఇటువంటి విషయాలపై అటు విజయ్ కానీ ఇటు రష్మిక కానీ స్పందించలేదు. అసలు క్లారిటీ కూడా ఇవ్వలేదు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రష్మిక మార్ఫింగ్ వీడియో విషయంలో విజయ్ స్పందన - వారికి శిక్ష పడాలంటూ