ETV Bharat / entertainment

Bichagadu 2 Collections : జోరు మీదున్న 'బిచ్చగాడు 2'.. రెండో రోజు అదిరిపోయే వసూళ్లు

'బిచ్చగాడు 2' బాక్సాఫీస్​ ముందు అదిరిపోయే వసూళ్లను అందుకుంటోంది. రెండు రోజుల్లోనే ఊహించని రేంజ్​లో వసూళ్లను సాధించింది. ఇదే ఊపును కొనసాగిస్తే.. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్​ను​ ఈజీగా చేరుకుంటుంది.

author img

By

Published : May 21, 2023, 3:51 PM IST

Updated : May 21, 2023, 4:13 PM IST

బిచ్చగాడు 2 కలెక్షన్స్
Bichagadu 2 Collections

Bichagadu 2 Collections : 'బిచ్చగాడు' సినిమాతో తన కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్నారు హీరో విజయ్‌ ఆంటోని. ఇప్పుడాయన ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'బిచ్చగాడు-2'తో ఆడియెన్స్​ ముందుకు వచ్చారు. మే 19న రిలీజైన ఈ చిత్రం పాజిటివ్​ టాక్​ తెచ్చుకుని థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. కలెక్షన్స్​ కూడా ఆశించిన దానికన్నా మంచిగా వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను అందుకుంటున్నట్లు తెలిసింది. మొదటి రోజు మంచి కలెక్షన్స్​ను అందుకున్న ఈ చిత్రం రెండో రోజు కూడా జోరు చూపించింది. ఆ వివరాలు..

తెలుగులో బిచ్చగాడు 2కు మొదటి రోజు రూ.4.10కోట్ల గ్రాస్ వసూలు చేయగా​.... రెండో రోజు రూ.3.15కోట్ల గ్రాస్ అందుకుందట. మొత్తంగా రెండు రోజుల్లో కలిపి రూ.3.95కోట్ల షేర్​, రూ.7.25కోట్లు గ్రాస్​ కలెక్ట్ చేసిందట.

రెండో రోజు.. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు మంచి రెస్పాన్స్ వచ్చింది. నైజాంలో రూ. 58 లక్షలు, సీడెడ్‌లో రూ. 28 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 26 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, గుంటూరులో రూ. 11 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలు వచ్చాయట. మొత్తంగా రూ. 1.62 కోట్ల షేర్, రూ. 3.15 కోట్లు గ్రాస్ వచ్చిందట.

వరల్డ్​ వైడ్​గా.. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్​ డే రూ.8.15 కోట్ల వరకు గ్రాస్​.. రెండో రోజు రూ.6.15కోట్ల గ్రాస్.. ​ మొత్తంగా రూ.14.30కోట్ల గ్రాస్​ అందుకుందట. రెండు రోజుల్లో.. తమిళంలో రూ.5.75కోట్లు, తెలుగులో రూ.7.25కోట్లు, కర్ణాటకలో రూ.0.65కోట్లు, ఓవర్సీస్​లో రూ.0.65కోట్ల గ్రాస్​ వసూలు చేసిందట.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మంచిగానే ప్రీ రిలీజ్ బిజినెస్​.. 'బిచ్చగాడు' లాంటి హిట్ సినిమాకు సీక్వెల్​గా రావడం వల్ల 'బిచ్చగాడు 2' సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ కోసం గట్టి పోటీనే ఏర్పడింది. అందుకు తగ్గట్టే తెలుగులో ఈ చిత్రానికి రూ. 6 కోట్ల వరకు బిజినెస్‌ జరిగిందట. ఇక వరర్డ్​ వైడ్​గా కలిపి రూ. 15 కోట్ల వరకు బిజినెస్​ జరిగిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

ఇకపోతే ఈ సినిమాలో విజయ్​ ఆంటోని హీరోగా నటించి.. స్వయంగా తెరకెక్కించిన చిత్రమిది. కావ్య థాపర్‌ హీరోయిన్​గా నటించింది. విజయ్ ఆంటోనీనే సంగీతాన్ని కూడా సమకూర్చారు. ఆయన భార్య ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మాతగా వ్యవహరించారు. రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ తదితరులు తదితర పాత్రల్లో నటించారు.
ఇదీ చూడండి : 'సింహాద్రి' రీరిలీజ్​.. ఫస్ట్​ డే రికార్డు కలెక్షన్స్​!

Last Updated : May 21, 2023, 4:13 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.