ETV Bharat / entertainment

బాలకృష్ణ, మహేష్​ బాబు కొత్త సినిమాల పేర్లు ఇవేనా!! - బాలకృష్ణ గోపీచంద్​ సినిమా

ప్రస్తుతం చిత్రసీమలో పలువురు అగ్రతారల సినిమాల విషయంలో పేరు విషయమై చర్చ జరుగుతోంది. సెట్స్‌పై ఉన్న ఒక్కో సినిమాకీ రెండు మూడు పేర్లు ప్రచారంలో వినిపిస్తూ.. ఊరిస్తున్నాయి. ఓ సారి ఆ సినిమాలు ఏంటి? ప్రచారంలో ఉన్న పేర్లేంటో తెలుసుకుందాం రండి.

upcoming telugu movie titles
upcoming telugu movie titles
author img

By

Published : Oct 13, 2022, 6:31 AM IST

Upcoming Telugu Movies: ఒక కథ సిద్ధం చేసి.. ఓ కాంబినేషన్‌ సెట్‌ చేయడం వెనుక ఎంతటి సుదీర్ఘ కసరత్తు జరుగుతుంటుందో.. సినిమా పేరు ఖరారు చేసే విషయంలోనూ అంతే స్థాయిలో మేధోమథనం సాగుతుంటుంది. ఎందుకంటే పేరే సినిమాకి సగం బలం. అదెంత ఆకర్షణీయంగా ఉంటే.. సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం అంత తేలికవుతుంది. కొన్నిసార్లు పేర్లే ఆయా చిత్రాలకు కావాల్సినంత ప్రచారాన్ని తెచ్చి పెట్టేస్తుంటాయి. అందుకే పేర్లు ఖరారు చేసే విషయంలో తెర వెనుక సుదీర్ఘ కసరత్తులు చేస్తుంటాయి చిత్ర బృందాలు.

అయితే కొన్ని సినిమాలకి పేర్లు ముందే ఖరారవుతుంటాయి. మరికొన్ని చిత్రాలకు చిత్రీకరణ దశలో కానీ పేర్లు పక్కా చేసుకోవు. అలాంటి వాటి విషయంలో అధికారిక ప్రకటన వెలువడటానికి ముందే బోలెడన్ని పేర్లు ప్రచారంలోకి వస్తుంటాయి. పేరు విషయమై సినీప్రియుల్లో పెద్ద చర్చ లేవనెత్తుతుంటాయి. ప్రస్తుతం చిత్రసీమలో పలువురు అగ్రతారల సినిమాల విషయంలో ఇదే జరుగుతోంది. సెట్స్‌పై ఉన్న ఒక్కో సినిమాకీ రెండు మూడు పేర్లు ప్రచారంలో వినిపిస్తూ.. ఊరిస్తున్నాయి.

జై బాలయ్య.. వీరసింహా రెడ్డి
బాలకృష్ణ - గోపీచంద్‌ మలినేని చిత్రం పట్టాలెక్కి చాలా కాలమే అయ్యింది. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా.. డిసెంబరు లేదా జనవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ చిత్ర టైటిల్‌పై ఇంత వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ సినిమా కోసం 'జై బాలయ్య', 'అన్నగారు' అనే పేర్లను పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. వీటితో పాటు కొత్తగా 'రెడ్డిగారు', 'వీరసింహా రెడ్డి' అనే పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మరి వీటిలో చిత్ర బృందం ఏ పేరుకు జై కొడుతుందన్నది వేచి చూడాలి. యథార్థ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఆసక్తికర కథాంశంతో రూపొందుతోన్న మాస్‌ యాక్షన్‌ చిత్రమిది. ఇందులో బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

upcoming telugu movie titles
బాలకృష్ణ

మరోసారి 'అ' సెంటిమెంట్‌?
మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 'అతడు', 'ఖలేజా' లాంటి విజయాల తర్వాత ఈ ఇద్దరి కలయిక నుంచి వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రమిది. ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా ఇప్పటికే ఓ చిన్న షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా మహేష్‌పై కొన్ని యాక్షన్‌ సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఈ చిత్రానికి 'పార్థు' అనే పేరు పరిశీలిస్తున్నట్లు గతంలో ప్రచారం వినిపించింది. అయితే ఇప్పుడీ సినిమా కోసం మరో కొత్త టైటిల్‌ తెరపైకి వచ్చింది. త్రివిక్రమ్‌ సినిమా పేర్లు ఎక్కువగా 'అ' అక్షరంతో మొదలవుతుంటాయి. ఇప్పుడీ ఆనవాయితీకి తగ్గట్లుగానే మహేష్‌ చిత్రానికి 'అయోధ్యలో అర్జునుడు' అనే పేరు ఖరారు చేయనున్నారని వార్తలు ఊపందుకున్నాయి.

upcoming telugu movie titles
మహేష్​ బాబు

'అధికారి'గా వచ్చేనా?
రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రం రూపొందుతోంది. 'ఆర్‌సి15' వర్కింగ్‌ టైటిల్‌తో సెట్స్‌పై ముస్తాబవుతున్న ఈ సినిమాని దిల్‌రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యమున్న యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో చరణ్‌ ఐఏఎస్‌ అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్లుగానే ఈ సినిమా కోసం 'సర్కారోడు' అనే టైటిల్‌ పరిశీలిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడీ చిత్రానికి 'అధికారి' అనే పేరును ఖాయం చేయనున్నారని సమాచారం. కథకు, చరణ్‌ పాత్రకు తగ్గ పేరు కావడంతో చిత్ర వర్గాలు ఈ టైటిల్‌ వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

upcoming telugu movie titles
రామ్​చరణ్​

చైతన్య.. '302'!
ఇటీవలే 'థ్యాంక్‌ యూ'తో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు నాగచైతన్య. ఇప్పుడు వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. కృతి శెట్టి కథానాయిక. వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందుతోంది. ఇందులో చైతూ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నట్లు తెలిసింది. ఆయన పాత్ర, కథకు తగ్గట్లుగానే చిత్ర బృందం ఈ సినిమా కోసం '302' అనే టైటిల్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఈ వర్కింగ్‌ టైటిల్‌తో సెట్స్‌పై ముస్తాబు చేస్తున్నారని, దాదాపుగా ఈ పేరునే ఖాయం చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో జీవా, ప్రియమణి కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు.

upcoming telugu movie titles
నాగచైతన్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.